ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ బలపడాలంటే రాష్ట్ర నాయకత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉందనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయినా సరే రాష్ట్ర నాయకత్వాన్ని మార్చే ఆలోచనలో బిజెపి పెద్దలు లేరు అనే భావన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వాన్ని మార్చకపోతే క్షేత్రస్థాయి ఇబ్బందులు చాలానే ఉంటాయి. అయినా సరే బిజెపి పెద్దలు ఈ విషయాలను పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయటం లేదు. ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా పెద్దగా పార్టీని ముందుకు తీసుకు వెళ్ళలేక పోతున్నారు.

అయితే ఇప్పుడు రాష్ట్ర నాయకత్వాన్ని మార్చడానికి బీజేపీ అధిష్టానం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. బిజెపి ఇప్పటివరకు ఏపీ మీద ప్రత్యేక దృష్టి పెట్టలేదు. ఉత్తరాది రాష్ట్రాల్లో నష్టం జరుగుతుంది కాబట్టి దక్షిణాది రాష్ట్రాల్లో ఆ నష్టాన్ని పూడ్చుకునే ఆలోచనలో భారతీయ జనతా పార్టీ నేతలు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ కి కొన్ని నిధులను కూడా విడుదల చేసే ప్రయత్నాలు బిజెపి చేస్తున్నట్టుగా ఈ మధ్యకాలంలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు వస్తున్న వార్తల ఆధారంగా చూస్తే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సహా కొంతమందిని మార్చడానికి బిజెపి అధిష్టానం రంగం సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తుంది.

 ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షురాలిగా పురంధరేశ్వరికి బాధ్యతలను ఇచ్చే ఆలోచనలో బిజెపి పెద్దలు ఉన్నట్టుగా సమాచారం. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా బిజెపి లోకి వస్తే ఆమెకు ఖరారు చేస్తామని బిజెపి నేతలు స్పష్టమైన హామీ ఇచ్చారట. రాష్ట్ర నాయకత్వంలో కొంతమందిని రాష్ట్ర స్థాయి నేతలను తప్పించే ఆలోచనలో కూడాబిజెపి అధిష్టానం ఉందని సమాచారం. ఇప్పటికే ఒక యువ నేత మీద బిజెపి అధిష్టానం దృష్టి పెట్టిందని త్వరలోనే దీనికి సంబంధించి ఒక కీలక అడుగు కూడా పడే అవకాశాలు ఉన్నాయని కొంతమంది వద్ద నుంచి బిజెపి నేతలు నివేదికలు కూడా తెప్పించుకున్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: