అమరావతికి సంబంధించి ప్రముఖ వార్త పత్రిక ఒక వార్తను ప్రొజెక్ట్ చేసింది. గతంలో ఏపీ తాత్కాలిక రాజధాని అమరావతి భవనాల నిర్మాణానికి రెండువేల అరవై కోట్లు ఋణం ఇచ్చియున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన పనులు అప్పట్లో వివిధ కారణాల వలన నిలిచిపోవడం జరిగింది. ఇలా నిలిచిపోయిన పనులు ఇప్పట్లో మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం సకాలంలో దీనికి కావాలన్న నిధులను అప్పు ఇవ్వకపోవడమే అని తెలుస్తోంది. గతంలో రుణ మంజూరుకు ఏపీ ప్రభుత్వం ఏ ఎం ఆర్ డి ఏ కి చెప్పిన హామీలకు బ్యాంకులు సిద్ధంగా లేవని సమాచారం. అమరావతిలో వివిధ నివాస భవనాల నిర్మాణానికి గతంలో తామిచ్చిన మూడువేల కోట్లు ఋణం మాటేంటని ఆ ప్రాజెక్టును పూర్తి చేసి, క్లోజ్అప్ రిపోర్ట్ సమర్పిస్తే తప్ప కొత్త రుణానికి సిఫార్సు చేయమని బ్యాంకులు  చెప్తున్నట్టు తెలిసింది. రాజధాని పనులకు తొలి విడతలో మూడువేల కోట్ల ఋణం ఇచ్చేందుకు బ్యాంకు అఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకుల కన్సార్టియం సూత్రప్రాయంగా అంగీకరించాయని, మూడు బ్యాంకులు తలా వెయ్యి కోట్ల రూపాయిలు ఇస్తాయని గతంలో దీనికి సంబంధించినటువంటి వార్తలు వచ్చాయి. 

మార్చి నెల 24 వ తేదీన జారీచేసిన జీవో పురపాలకశాఖ ఈ విషయాన్ని చెప్పింది. 1206.39 కోట్లతో అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు మరియు 18,879  కోట్ల ఆరు ఎల్ పి ఎస్  ల్యాండ్ పొల్యూషన్   స్కీం  జోన్లలో జీవో మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపడుతున్నట్టు  ఆ జీవోలో చెప్పింది. కానీ ఆ బ్యాంకులు ఇప్పుడు పాత రుణంతో మెలికబెట్టాయి. వారితో సంప్రదింపులు జరిపి కొత్త ఋణం మీద ఒప్పించేందుకు చాలా సమయం పడుతుందని అమరావతి అభివృద్ధి అధికారులు అన్నారు. అప్పటికి  కూడా  వాళ్ళు ఋణం ఇచ్చేందుకు వాళ్ళు సిద్ధపడకుంటే ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిందేనని చెప్తున్నారు. అమరావతి మంత్రులు హైకోర్టు న్యాయమూర్తుల బంగ్లాలు, ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు అఖిల భారతీయ సర్వీస్ అధికారులు గెజిటెడ్  నాన్ గెజిటెడ్ నాలుగోవ తరగతి ఉద్యోగులకు అపార్ట్మెంట్ నిర్మాణానికి బ్యాంకు అఫ్ బరోడా, యూనియన్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకుల కన్సార్టియం అప్పట్లో సి ఆర్ డి ఏ రెండువేల అరవై కోట్ల ఋణం తీసుకుంది. 

ఈ రుణానికి ఏ ఎం ఆర్ డి ఏ ప్రతినెలా పదకొండు కోట్ల  వరకు వడ్డీ చెల్లితోంది. ఇప్పుడు మళ్ళీ ఇదే కన్సార్టియం నుంచి రాజధానిలో ప్రధాన  మౌలిక వసతులు ఎల్ పి ఎస్ లేఔట్ వసతుల అభివృద్ధికి పదివేల కోట్ల వరకు ఋణం తీసుకోవచ్చని భావిస్తోంది. ఇప్పుడు అమరావతిలో పనులుఅన్నీ 2019  మే నెలాఖరున ప్రభుత్వం నిలిపేసింది. కాబట్టి ఇదంతా వచ్చింది. ఇందులో తేలాల్సిన విషయం ఏందంటే ఇప్పుడు దాదాపుగా కేంద్ర ప్రభుత్వం రెండువేల కోట్లు ఇచ్చింది. ఒక ఐదువేల కోట్లు ఖర్చుపెట్టమన్నారు. ఇప్పుడు ఇది చూస్తే ఏం తెలుస్తుంది రెండువేల అరవై కోట్ల రూపాయలకి సంబంధించి  అవి ఖర్చుపెట్టలేదని తెలుస్తుంది. అంటే పదివేల కోట్ల రూపాయిలు పెడితే ఆ భవనాలు అయిపోతాయా అంటే ఆ భవనాలకు అది సరిపోయినట్టేనా ? . అంటే పదివేల కోట్ల రూపాయిలకు కట్టింది ఆ నాలుగు భవనాలేనా ? అనే సందేహాలు కలుగుతున్నాయి. దీని ద్వారా మరిన్ని లొసుగులు బయటపడనున్నాయో అర్ధం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: