తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల కు సంబంధించి తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినీ టార్గెట్ గా చేసుకుని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుపతి ఉప ఎన్నికల్లో తాము గెలుస్తామని ధీమా గా ఉన్న అధికార పార్టీకి ఇప్పుడు ఎందుకు ఇలా దొంగ ఓట్లు వేయిస్తుంది అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఈ అంశానికి సంబంధించి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం.

ఇక ఇదిలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబుపై, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గం స్థానిక టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలంటూ సీఈవోకు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. సీఈవో విజయానంద్ కు  వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లెల్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా జరుగుతోన్న ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్గించే ప్రయత్నాన్ని, ఓటర్లను పక్కదారి పట్టించేలా టీడీపీ ప్రయత్నిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాలాజీ దర్శనం కోసం కొంతమంది భక్తులు నేడు వస్తే వారిని మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, మాజీ తుడా చైర్మన్ జి.నరసింహా యాదవ్ అడ్డగించి బోగస్ ఓటర్లు అని అసత్య ప్రచారం చేశారు అని మండిపడ్డారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బయటివారిని తీసుకొచ్చి తిరుపతి లోక్‌ సభ లో బోగస్ ఓట్లు వేయిస్తుందని అసత్య ప్రచారం చేశారు అని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. నిజానికి బోగస్ ఓటర్లు ఉంటే టీడీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్ ల వద్ద వారిని గుర్తించే అవకాశం ఉంది అని చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారం చేస్తోన్న చంద్రబాబు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో స్థానిక నేతలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: