కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.  మొన్నటివరకు కరోనా వైరస్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయని దేశ ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో అందరిలో కరోనా వైరస్ భయం పోయి కాస్త ధైర్యం నిండిపోయింది.  ఈ క్రమంలోనే ఇక అటు ఉపాధి అవకాశాలు కూడా జరుగుతున్నాయని ఎంతో మంది సామాన్య ప్రజలు ఆనంద పడుతున్న సమయంలో మరోసారి కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతు ఉండడం అందరిని ఆందోళన కలిగిస్తోంది.


 రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మహమ్మారి వైరస్ ను కంట్రోల్ చేయడం సవాలుగానే మారిపోయింది. అయితే మునుపటి కంటే వేగంగా ప్రస్తుతం సెకండ్ వేవ్ శరవేగంగా విజృంభిస్తోంది.  ప్రజలందరూ కరోనా వైరస్ పట్ల ఎంత అవగాహన కలిగి ఉన్నప్పటికీ  ఈ మహమ్మారి వైరస్ మాత్రం ఎంతో మంది పై పంజా విసిరితు ఉంది. ఈ క్రమంలోనే మరోసారి దేశంలో లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధిస్తూ ఉండడం అందరినీ ఆందోళన కలిగిస్తోంది.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇటీవల కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సరికొత్త డిమాండ్ తెరమీదికి తెచ్చింది.   దేశంలోని అన్ని రాష్ట్రాలలో కూడా కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో కేవలం 45 సంవత్సరాలు నిండిన వారికి మాత్రమే కాదు 25 సంవత్సరాలు నిండిన వారికి కూడా  వైరస్ వ్యాక్సిన్ అందించాలి అంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసింది సోనియాగాంధీ. అంతేకాకుండా లాక్ డౌన్ అమలు చేస్తే ఇక సామాన్యులకు నెలకు 6000 రూపాయలు వరకు సహకారం అందించాలి అంటూ డిమాండ్ చేసింది సోనియాగాంధీ.  అయితే సోనియా గాంధీ నిర్మాణాత్మకమైన ప్రతిపక్షనేతగా డిమాండ్ తెర మీదికి తెచ్చింది అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: