రాజకీయ నాయకులు అన్న తరువాత వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి. వాటిని అమలు చేయడంలో ప్రయోగించడంతో సరైన టైమింగ్ అవసరం. లేకపోతే ఎంతటి వ్యూహాలైనా బెడిసికొట్టకమానవు. ఇపుడు ఏపీ సీఎం జగన్ విషయంలో ఒక పెద్ద చర్చ సాగుతోంది.

దేశవ్యాప్తంగా మోడీ మీద తీవ్ర  వ్యతిరేకత ఉంది. మొదటి విడత కరోనాను సక్సెస్ ఫుల్ గా అడ్డుకున్న ప్రధాని మోడీ రెండవ విడత లో మాత్రం అంత చురుకుదనం చూపించలేకపోయారు అన్న మాట అయితే ఉంది. అదే సమయంలో బీజేపీ అమలు చేస్తున్న  ఆర్ధిక విధానాలు కూడా దేశానికి ఇబ్బందిగా మారుతున్నాయి. ఇక సంస్కరణల పేరిట ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం విషయంలో కూడా మోడీ సర్కార్ దూకుడు చూపిస్తోంది. దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు పైకి ఎగబాకడంతో పాటు సామాన్యుడి జేబు చిల్లు అవుతూండంతో మోడీ సర్కార్ మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువలా ఉంది.

దాంతో పాటు కరోనా వేళ దేశంలోని ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కూడా  మోడీనే ఆడిపోసుకుంటున్నాయి. దీంతో మోడీకి బీజేపీకి ఈ సెగలు తప్పడంలేదు. సరిగ్గా ఈ సమయంలో జగన్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ని కాస్తా  తగ్గమంటూ చేసిన సూచన ఆయనకే ఎదురు నిలిచింది. అంతే కాదు, మోడీని ఏమనవద్దు అంటూ ఇచ్చిన సలహా కూడా విపక్ష శిబిరం మొత్తం మండిపోయేలా చేస్తోంది. దీని మీద జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అయితే  దిమ్మతిరిగే షాకే ఇచ్చారు

జగన్ నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అది దేశమంతటికీ తెలుసు అంటూ కౌంటర్ ఇచ్చేశారు. మీరు ఎప్పటికీ సురక్షితంగా ఉండాలి అంటూ ఆయన సీబీఐ కేసులను పరోక్షంగా ప్రస్తావించారు. మొత్తానికి దీన్ని చూస్తూంటే జగన్ పరువును చాలా స్మూత్ గా సోరెన్ తీసేశాడు అనే అంటున్నారు. కాని కాలంలో జగన్ ఇచ్చిన సలహా ఆయన ఇమేజ్ ని దేశంలో పూర్తిగా తగ్గించేలా ఉందని కూడా అంటున్నారు. జగన్ కాస్తా ఎదగండి అంటూ ఒడిషాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి ఉలాకా సైతం సూచనలు చేయడం జగన్ ని మరింత ఇబ్బంది పెట్టిందనే చెప్పాలేమో. ఏది ఏమైనా జగన్ తరఫున వకాల్తా పుచ్చుకుని తాను అడ్డంగా బుక్ అయ్యారనే అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: