వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లేనా. గండాలు అన్నీ దాటిపోయినట్లేనా. అసహనాలు, ఆవేశాలకు కాలం చెల్లనుందా, అధినేత ముఖం మీద చిరునవ్వులు తొణికిసలాడుతాయా. వీటన్నిటికీ ఒక్కటే జవాబు. అవును అన్నదే ఆ జవాబు.

ఇదంతా ఎందుకంటే శాసనమండలిలో వైసీపీకి పూర్తి ఆధిక్యం దక్కబోతోంది. రేపటి నుంచి వైసీపీదే మండలిలో రాజ్యం. అక్కడ ఒకేసారి ఏడుగురు టీడీపీ ఎమ్మెల్సీలు రిటైర్ కాబోతున్నారు. దాంతో టీడీపీ బలం ఒక్కసరిగా మండలిలో 15కి తగ్గిపోతోంది. అదే సమయంలో వైసీపీ బలం 19కి ఎగబాకుతోంది. ఇదిలా ఉంటే మొత్తం శాసనమండలిలో సీట్లు 58గా ఉన్నాయి. ఇందులో రేపటితో మరో ఎనిమిది మంది పదవుల నుంచి రిటైర్ కాబోతున్నారు. వారిలో వైసీపీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఉన్నారు.

అలాగే మరో ఆరు స్థానాలు కూడా ఖాళీగా ఉన్నాయి. దాంతో 14 పోగా 44 మంది సభలో ఉంటారు. వీరిలో 19 మందితో వైసీపీ పెద్ద పార్టీగా ఉండగా 15తో టీడీపీ ఉంది. మిగిలిన పది సీట్లు బీజేపీ, ఇతర పార్టీలు, ఉపాధ్యాయ‌ ఎమ్మెల్సీలవి. ఇక ఈ పద్నాలుగులో మూడు సీట్లు ఎమ్మెలే కోటాలో భర్తీ అవుతాయి. కరోనా తగ్గాక ఎపుడైనా  ఆ ఎన్నిక జరుగుతుంది. దాంతో ఆ మూడూ వైసీపీకే వస్తాయి. అపుడు వైసీపీ బలం 22కి చేరుకుంటుంది. మరో వైపు 11 స్థానిక కోటా ఎన్నిక మాత్రం వాయిదా పడే చాన్స్ ఉంది. ఎందుకంటే జిల్లా, మండల పరిషత్ ఎన్నికలను కోర్టు కొట్టేసింది కాబట్టి. దాని మీద అప్పీల్ కి వెళ్ళడమా, లేక కొత్తగా ఎన్నికలు పెట్టడమా అన్న దాని మీదనే ఈ ఎమ్మెల్సీల ఎంపిక ఉంటుంది. ఇప్పటికే పంచాయతీలు, మునిసిపాలిటీలలో వైసీపీ విజయం సాధించింది. పరిషత్తు ఎన్నికలు ఎపుడు జరిగినా వైసీపీదే విజయం కాబట్టి ఆ 11 సీట్లలో కూడా కచ్చితంగా వైసీపీ వారే ఎమ్మెల్సీలుగా వస్తారని అంటున్నారు. అపుడు ఏపీ కౌన్సిల్ లో వైసీపీ బలం 33కి రీచ్ అవుతుంది. మొత్తానికి మండలిలో బిల్లులు ఆమోదం పొందక ఎన్నో తిప్పలు పడిన వైసీపీకి రేపటి నుంచి గుడ్ న్యూస్ గానే అంతా ఉంటుంది అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: