చిక్కుల్లో రేవంత్ ... కేసీఆర్ స్కెచ్

ఓటుకు నోటు కేసు ను మ‌రిచిపోయారా.. మీరు మ‌రిచిపోయినా నేను మ‌రిచిపోను అన్న విధంగా ఉంది కేసీఆర్ వ్య‌వ‌హారం. ఆనాడు రెండు తెలుగు రాష్ట్రాల‌నూ అట్టుడిగేలా చేసిన ఈ కేసు త‌రువాత ఫోన్ ట్యాపింగ్ దిశ‌గా మా ర‌డం, అటుపై అది కూడా మ‌రిచిపోవ‌డం అంద‌రి వంతైంది. చంద్ర‌బాబు తో స‌హా అనేక మంది ఈ కేసులో త‌మ త‌ప్పు లేద‌నే గ‌గ్గోలు పెట్టారు. కానీ ఏసీబీ మాత్రం ఎవ‌రి త‌ప్పూ తేల్చ‌క ఎప్ప‌టిక‌ప్పుడు విచార‌ణ నిమిత్తం రే వంత్ రెడ్డి మ‌నుషుల‌ను పిలుస్తోంది. ఏం చేస్తార‌ట‌! ఈ కేసును ఏం లేదు ఎప్పుడు ఎవ‌రికి అవ‌స‌రం అయితే వారికి అనుగుణంగా మారుస్తారు. కొద్ది రోజులే నాట‌కం న‌డిపి వ‌దిలేస్తారు.


ఈ విధంగా కావొచ్చు కానీ చెప్ప‌లేం.. నిర్థార‌ణ లేకుండా ఏమీ రాయ‌లేం..సీఎం కేసీఆర్ విప‌క్షాల‌ను టార్గెట్  చేసేందుకు మ‌రో సారి త‌న‌కు క‌లిసి వ‌చ్చిన కొన్ని అస్త్రాల‌నే వాడుకోవ‌చ్చు. ఎప్పుడో మూల‌కు చేరిన ఓటుకు నోటు కేసు లెక్క తేల్చండ‌ని చెప్ప‌వ‌చ్చు. లేదా ఇంకేమ‌యినా కేసుల‌లో విప‌క్షాల‌ను ఎలా ఇరికించాలో అన్న‌దీ చూడ‌వ‌చ్చు. ఒక‌వేళ ప‌ద్ధ‌తి ప్ర‌కారం అయితే ఏసీబీ త‌న ప‌ని తాను చేసుకు పోయి  ఈ పాటికి కేసు క్లోజ్ చేయాలి కా నీ ఎందుక‌నో ఏళ్ల‌కు ఏళ్లు ఈ కేసును లాగుతుందో ఇప్ప‌టికీ ఎవ్వ‌రికీ పాలుపోదు. తాజాగా రేవంత్ ను చిక్కుల్లో ప‌డేసే వార్త‌ను కేసీఆర్ మీడియాకు అందించారానే భావించాలా..ఏమో! అనుకోవాలి.అలా అయితే ఇప్పుడిక చా లా కేసులు వెలుగులోకి రావొచ్చు.


ఇటీవ‌లే టీపీసీసీ ప‌గ్గాలు అందుకున్న రేవంత్ రెడ్డికి ఇది అనూహ్య ప‌రిణామం. ఆయ‌న నిందితుడిగా ఉన్న ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఒక వార్త వెలుగు చూసింది. ఓ వైపు ఎన్నిక‌ల వేడితో అట్టుడికిపోతున్న తెలం గాణ పొలిటీషియ‌న్ల‌కు ఈ స‌మాచారం కాస్త అంది వ‌చ్చే అంశ‌మే కావొచ్చు. ఆయ‌నను ఇర‌కాటంలో పెట్టే అంశాలేవో ఇప్పుడిప్పుడు వెలుగులోకి వ‌చ్చేందుకు ఆస్కారం ఉంది. గ‌త కొద్ది రోజులుగా సైలెంట్ గా ఏసీబీకి ఓటు కు నోటు ప‌రిణామాల్లో క‌ద‌లిక తేవాల‌న్న ఆలోచ‌న కార‌ణంగా ఇలా చేసిందో మ‌రొక‌టో కానీ రేవంత్ కు ఈ ప‌రిణామం మింగుడు ప‌డ‌నిదే. ఒక‌వేళ కేసీఆర్ నే క‌నుక ఈ క‌థ‌ను త‌వ్వితీస్తే మ‌ళ్లీ కొత్త వివాదాలు అన్నీ తెర‌పైకి వ‌చ్చే ఛాన్స్ ఉంది. రేవంత్  కు చెందిన ఓ వ్య‌క్తిని ఇప్ప‌టికే ఏసీబీ విచార‌ణ చేసింది. మ‌రో ఇద్ద‌రికి నోటీసులు వెళ్లాయి. రేవంత్ రెడ్డి పీఏ కు, ఆయ‌న డ్రైవ‌ర్ కు ఈ నోటీసులు ఇష్యూ చేసింది. ఇది వ‌రకే వీరికి నోటీసులు జారీ చేసి వి చార‌ణ‌కు త‌మ కార్యా ల‌యానికి రావాల‌ని చెప్పినప్ప టికీ, వాటిని అందుకున్న వీరిద్ద‌రూ ఇవాళ ఏసీబీ అధికారుల ఎదుట గైర్హాజ‌ర‌య్యారు. దీంతో వీరికి బెయిల్ బుల్ వారెంట్లు ఇష్యూ చేసింది ఏసీబీ. మరో నిందితుడు ఉ ద‌య‌సింహ మాత్రం విచార‌ణ‌కు హాజ‌రై, త‌న త‌ర‌ఫు వాంగ్మూలం ఇచ్చి వెళ్లార‌ని స‌మాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: