భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత స్థానం కోసం ఎప్పటి నుండో ప్రయత్నిస్తుంది. కానీ చైనాకు దక్కిన ఆ స్థానం భారత్ కు ఇవ్వడానికి వెనుక కుట్రపూరిత రాజకీయాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయినా భారత్ మాత్రం ప్రయత్నిస్తూనే ఉంది. అంటే అది సాధిస్తే ఏదో మేలు ఒరిగిపోతుందనేది పెద్ద విషయం కాదు, ఎన్ని రాజకీయాలు చేసినా మన హక్కు మనం సాధించుకున్నాం అనే పట్టుదల అంతే. తాజాగా మోడీ అమెరికా పర్యటనలో ఈ విషయం పై బైడెన్ తో చర్చ జరిగింది. దీనితో భేటీ అనంతరం బైడెన్ మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాలని చెప్పారు. అది ఇవ్వాల్సిందే అని ఆయన ఉద్ఘాటించారు.

కరోనా మొదటి వేవ్ సమయంలో ఐక్యరాజ్య సమితికి అధ్యక్ష హోదాలో ఉన్న భారత్ తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిందని బైడెన్ కొనియాడారు. అలాగే ఆఫ్ఘన్ ఆక్రమణ విషయంలో తాలిబన్ లతో కూడా భారత్ ఆచితూచి స్పందించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ భేటీతో భారత్ అమెరికాల స్నేహం మరింత బలపడుతుందని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ భేటీలో భాగంగా మోడీ అక్కడి అధికారులు కమలా హారిస్ ను కూడా కలిసి అనేక అంశాలపై చర్చించారు.

నిజానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని అనేక దేశాలు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. అయితే ప్రతిసారి చైనా ఆ అవకాశాన్ని కాలరాస్తూ వస్తుంది. దీనితో ఎప్పటి నుండో భారత్ తాత్కాలిక సభ్యదేశంగానే కొనసాగుతుంది. ఈసారి కూడా ఈ అవకాశం దక్కకపోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. చైనా మొత్తానికి భారత్ పై కుట్రలు చేస్తుంది, అమెరికా కరోనా సంక్షోభం నుండి ఇంకా బటయకు రాలేదు, ఇలాంటి పరిస్థితులలో భారత్ కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లభిస్తే అది మరింతగా భారత ఖ్యాతిని పెంచేస్తుంది అనేది ఆయా దేశాల అక్కసు.

మరింత సమాచారం తెలుసుకోండి: