తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు ఆ నలుగురి మధ్యలో ఉంది. చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో పాటు... దిల్ రాజు, సురేష్ బాబు వంటి మెగా ప్రొడ్యూసర్లు కూడా టాలీవుడ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ప్రభుత్వాలతో చర్చలు, వారికి మద్దతుగా కామెంట్లు చేయడం ఇప్పుడు సర్వ సాధారణం అయిపోయింది. అదే ఇప్పుడు ట్రెండ్ కూడా. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలకు టాలీవుడ్ జై కొడుతోంది. ఇంకా చెప్పాలంటే.. ఏ నిర్ణయం తీసుకున్నా సూపర్ అని కితాబిస్తోంది. ఇప్పుడు తాజాగా ప్రభుత్వమే ఆన్ లైన్ టికెట్ సేల్స్ ప్రారంభించడం పై సినీ ప్రముఖులంతా స్వాగతించారు. అసలు ప్రభుత్వ నిర్ణయం సూపర్ అని కితాబిచ్చారు కూడా. అసలు పరిశ్రమకు జగన్ సర్కార్ అందిస్తున్న సర్కార్ అద్భుతం అని ప్రశంసల జల్లు కురిపించారు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, ప్రొడ్యూసర్లు సీ.కళ్యాణ్.

ఇదే సమయంలో సినీ పరిశ్రమపై జగన్ సర్కార్ వ్యవహరిస్తున్న విధానంపై జనసేన పార్టీ అధినేత, పవన్ స్టార్ పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. వకీల్ సాబ్ సినిమాలో నేను హీరోగా ఉన్నా కాబట్టే.. ఆ సినిమాపై ఎన్నో ఆంక్షలు పెట్టారన్న పవన్... అదే వేరే హీరో ఎవరైనా ఉంటే... ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సినిమా హాళ్లు యధావిధిగా తెరుచుకునే వన్నారు. ఓ వైపు తెలంగాణలో అన్ని హాళ్లు నడుస్తుంటే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంక్షలు ఎందుకూ అని ప్రశ్నించారు. నాపై కోపం ఉంటే... నా సినిమాలు ఆపండి... మిగిలిన సినిమాలకు అనుమతివ్వండి అంటూ ప్రభుత్వంపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు పవన్ కల్యాణ్. పరిశ్రమలోని పెద్దలందరూ కలిసి సమస్యలపై మాట్లాడాలని సూచించారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. మరి ఇన్నిసార్లు చిరంజీవి అండ్ కో జగన్‌తో కలిసి ఏ విషయం మాట్లాడుతుందని అందరు గుసగుసలాడుతున్నారు. పరిశ్రమ సమస్యలపై కాకుండా... సొంత లాభం కోసం జగన్‌ను కలుస్తున్నారా అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: