టీ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి  గోదావరి నది పరివాహక ప్రాంతంలోని ముఖ్యమైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించారు. తాను టిడిపిలో ఉన్నప్పుడు అత్యంత సన్నిహితుడైన గండ్ర సత్యనారాయణ రావును ఆయన పరిచయాలతో నే ప్రస్తుతం ఏఐ ఎస్ బి పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. ఈనెల 30వ తేదీన జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ఈ సభ విజయవంతానికి మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే సీతక్క, పోదాం వీరయ్య లకు బాధ్యతలు అప్పగించారు. ఈ బహిరంగ సభకు సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్  జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్క, పోడెం వీరయ్య తో పాటు మాజీ పిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, రాష్ట్రానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఈ బహిరంగ సభకు హాజరు కానున్నారు.

 కొన్ని నెలలుగా గండ్ర సత్యనారాయణ రావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు అని జరిగిన ప్రచారానికి ఈ నెల 30తో తెర పడనుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా లో ఎక్కడా లేని విధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయాల్లో కీలక మలుపు తిరగనుంది. భూపాలపల్లిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన గండ్ర వెంకటరమణా రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో చేరడంతో రెండు సంవత్సరాలుగా భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ అయోమయ పరిస్థితిలో ఉంది. పార్టీలో సరైన నాయకుడు లేక కాంగ్రెస్ ఓటుబ్యాంకు ఉన్న భూపాలపల్లిలో కార్యకర్తలు సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీకి వస్తుండడంతో  నూతన ఉత్సాహం నెలకొంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో 50 వేలకు పైగా ఓట్లు సాధించి ఎన్నికల్లో గెలుపుకు దగ్గరలో కొద్ది ఓట్లతో ఓడిపోయిన గండ్ర సత్యనారాయణను పార్టీలోకి తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి ప్రయత్నం విజయవంతం అవుతుంది . ఎన్నికల్లో గెలవగల సత్తా ఉన్న గెలుపు గుర్రాలపై రేవంత్ రెడ్డి దృష్టి సారించి రాష్ట్రవ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. భూపాలపల్లి నియోజకవర్గం లోని గణపురం మండలం బుద్ధారం గ్రామానికి చెందిన గండ్ర సత్యనారాయణ రావు టిడిపిలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014 లో జరిగిన ఎన్నికల్లో గండ్ర సత్యనారాయణ రావు కు టిడిపి నుండి టికెట్ లభించలేదు. కానీ చంద్రబాబు నాయుడు బిజెపి నాయకులకు  బిఫాం ఇప్పించారు. దాంతో గండ్ర సత్యనారాయణ రావు బిజెపి పార్టీ పువ్వు గుర్తుపై పోటీ చేసి 50వేలకు పైగా ఓట్లు సాధించారు.

 ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో సత్యనారాయణరావును టిఆర్ఎస్ నేత కేటీఆర్ స్వయంగా హైదరాబాద్ తెలంగాణ భవన్ కు పిలిపించుకుని టికెట్ ఇస్తామని నమ్మించి కండువా కప్పారు . అనంతరం గండ్ర  సత్యనారాయణరావుకు టిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ లభించేది అనే విషయాన్ని గమనించిన గండ్ర  సత్యనారాయణ రావు ఆ పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు. 2018లో ఏఐ ఎఫ్ బి పార్టీ సింహం గుర్తు పై భూపాలపల్లిలో పోటీచేసి కొద్ది ఓట్లతో ఓడిపోయారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్న సత్యనారాయణరావుకు నియోజకవర్గంలో అనుచరుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: