వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే పట్టుదల అన్నీపార్టీల్లో కనబడుతోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశంపార్టీయే అంటు చంద్రబాబునాయుడు పదే పదే చెబుతున్నారు. వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు జనాలు రెడీగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి ప్రభుత్వం బాధ్యతను తానే తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించేశారు. ప్రకటన అయితే చేశారు కానీ దానికి దారితెన్ను అంటు ఏమీలేదు.

ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీకి మళ్ళీ 151 సీట్లు వచ్చితీరాలంటు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా మంత్రులు, జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలకు చెప్పారు. అవకాశముంటే 175కి 175 సీట్లు ఎందుకు గెలవకూడదని కూడా నిలదీశారు. దాంతో మూడు పార్టీల అధినేతలు అధికారంలోకి వచ్చేస్తున్నట్లే అనుకుంటున్నారని తేలిపోయింది. మిగిలిన రెండుపార్టీల సంగతిని పక్కనపెట్టేస్తే వైసీపీ అధికారంలోకి రావాలంటే మూడుపాయింట్లు ఫాలో అవ్వాలనే చర్చ జరుగుతోంది.


ఆ మూడు పాయింట్లు ఏమిటంటే చివరి ఆరుమాసాలు జగన్ చాలా జాగ్రత్తగా ఉండాలి. రెగ్యులర్ గా జనాలతోనే ఉండటం, తనతో పాటు మంత్రులు, ఎంఎల్ఏలు, నేతలను జనాల్లోనే తిప్పాలి.  ఈలోగా రాష్ట్రానికి ఎన్ని వీలైతే అన్ని పరిశ్రమలను తీసుకురావాలి. అప్పుడే సంక్షేమఃపరిశ్రమలు రెండు ఉన్నట్లు జనాలకు చెప్పుకోవచ్చు. అలాగే టికెట్ల కేటాయింపులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోపణలున్నవారికి, జనాలు, పార్టీ క్యాడర్ తో టచ్ లో లేని వారికి టికెట్లు ఇవ్వకూడదు. ఎలాగూ సర్వేలు చేయించుకుంటున్నారు కాబట్టి ఫీడ్ బ్యాక్ ఆధారంగా జగన్ బాగా స్ట్రిక్ట్ గా ఉండాలి.


ఇక చివరి పాయింట్ ఏమిటంటే పోలింగ్ రోజున అందరినీ ఓటింగ్ కు వచ్చేట్లుగా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి. ఇన్ని సంక్షేమపథకాలు అమలు చేస్తున్నాం కాబట్టి లబ్దిదారులు లేదా జనాలే వచ్చి ఓట్లేస్తారులే అనుకుంటే దెబ్బపడటం ఖాయం. ఎవరెంత తోపైనా పోల్ మ్యానేజ్మెంట్ చాలా ముఖ్యం. పోలింగ్ రోజున పార్టీ యంత్రాంగం మొత్తాన్ని యాక్టివేట్ చేసి జనాలను పోలింగ్ కేంద్రాలకు తెప్పించి ఓట్లేయించుకోలేకపోతే ఐదేళ్ళ శ్రమంతా వృధా అయినట్లే లెక్క. కాబట్టి ఈ మూడుపాయింట్లు జాగ్రత్తగా ఫాలో అవ్వకపోతే కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: