యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ ఏడాది సీజన్ ముగింపు దశకు వచ్చింది. అయితే ఈ రోజు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021  పాయింట్స్ టేబుల్ లో మొదటి రెండు స్థానాల్లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి, అయితే ఈ మ్యాచ్ ఢిల్లీ అలాగే చెన్నై జట్లకు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ లాంటిది. ఎందుకంటే ఈ రెండు జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్ కు అర్హత సాధించి ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా... ఓడిన వారికి ఆ ఓటమి పెద్ద ప్రభావం చూపించలేదు. అయితే గెలిచిన జట్టు మాత్రం ఈ ఏడాది ఐపీఎల్ పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది. కాబట్టి ఈ రెండు జట్లు ఆ మొదటి స్థానం కోసం పోటీ పడుతున్నాయి. అయితే ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ తీసుకున్నాడు. ఆ కారణంగా ధోనీసేన మొదట బ్యాటింగ్ కీ రానుంది. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు ఒక మార్పుతో బరిలోకి వస్తుంది చెన్నై సూపర్ కింగ్స్ మూడు మార్పులతో వస్తుంది. ఇక గత మ్యాచ్లో రాజస్థాన్ పై ఓడిపోయిన చెన్నై ఈ మ్యాచ్ లో గెలవాలని చూస్తుంటే... గత మ్యాచ్లో ముంబై పై గెలిచిన ఢిల్లీ ఆ జోరును కొనసాగించాలని అనుకుంటుంది. చూడాలి మరి ఎవరు ఈ మ్యాచ్లో విజయం సాధించి మొదటి స్థానానికి చేరుకుంటారు అనేది  

ఢిల్లీ జట్టు : పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (wk/c), రిపాల్ పటేల్, అక్సర్ పటేల్, షిమ్రాన్ హెట్‌మీర్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అవేశ్ ఖాన్, అన్రిచ్ నార్ట్జే

చెన్నై జట్టు : రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మోయిన్ అలీ, అంబటి రాయుడు, ధోని (wk/c), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్

మరింత సమాచారం తెలుసుకోండి: