భారత టీ-20 జట్టులో వైస్ కెప్టెన్‌గా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను సెలెక్ట్‌ చేయాలని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశాడు. టీమిండియా ఓపెన‌ర్‌ కేఎల్ రాహుల్, వికెట్ కీప‌ర్ రిషబ్ పంత్ కంటే ఫాస్ట్ బౌల‌ర్ బుమ్రాకు వైస్ కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని పేర్కొన్నాడు సెహ్వాగ్‌.  ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, నూత‌న టీ-20 కెప్టెన్ రాకతో భారత క్రికెట్ జట్టు కొత్త దశలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉందని, అయితే ఇప్ప‌టికే కెప్టెన్‎గా రోహిత్ శర్మ పేరు వినబడుతుందని, వైస్ కెప్టెన్‌ను కూడ సెలెక్ట్ చేస్తే బాగుంటుంద‌ని సెహ్వాగ్‌ చెప్పారు.

అయితే వైస్ కెప్టెన్‎పై  ప‌లు ర‌కాలుగా చ‌ర్చ‌లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా  కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ పేర్లు ఎక్కువగా వినిపిస్తుండగా, సెహ్వాగ్ మాత్రం బుమ్రా పేరును తెరపైకి   తీసుకొచ్చాడు.  ఈ మధ్యే మాజీ ఫేస్ బౌలర్ నెహ్రా ఏకంగా బుమ్రాను కెప్టెన్ చేయాలని కూడా డిమాండ్ చేశాడు. బౌలర్ కెప్టెన్‎గా ఉండకూడదని ఏ రూల్ బుక్‎లో రాయలేదని పేర్కొన్నాడు నెహ్రా.

2021 ఐపీఎల్ సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్‌కు కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించారు. ఇక రిష‌బ్ పంత్ ఢిల్లీకి కూడ కెప్టెన్‌గా చేశాడు. కానీ బుమ్రా మాత్రం ఏ ఐపీఎల్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హించిక‌పోయినా బౌలింగ్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడని, అత‌ని ఫామ్ ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటే అభిమానులు, నిపుణుల టీ-20 వైస్ కెప్టెన్ రేసులో బుమ్రా అగ్ర‌స్థానంలో ఉండాల‌ని సెహ్వాగ్ పేర్కొన్నాడు. మూడు ఫార్మాట్ల‌లో ఆడే వారిని కెప్టెన్ లేదా వైస్ కెప్టెన్‌గా చేస్తుంటారు కాబ‌ట్టి మూడు ఫార్మాట్ల‌లో ఆడే ఆట‌గాళ్ల‌లో జ‌స్ప్రిత్ బుమ్రా కంటే మెరుగైన ఎంపిక మ‌రెవ‌రూ లేర‌ని వెల్ల‌డించారు. రేసులో రాహుల్, రిష‌బ్‌పంత్ ఉంటార‌ని, కానీ బుమ్రాకు తొలిస్థానం ఇవ్వాల‌ని చెప్పారు సెహ్వాగ్‌.

వారు మూడు ఫార్మాట్ల‌లో ఆడ‌తారా? జ‌స్ప్రీత్ బుమ్రా వ‌లే నిల‌క‌డ‌గా మూడింట్లో రానించ‌గ‌ల‌రా..? అని పేర్కొన్నారు. భార‌త క్రికెట్ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ ఎవ‌రు కెప్టెన్‌గా చేయ‌లేద‌ని, క‌పిల్‌దేవ్ కూడ ఆల్‌రౌండ‌ర్‌గా కెప్టెన్‌గా కొన‌సాగాడు అని వెల్ల‌డించాడు సెహ్వాగ్‌. కానీ స్పిన్న‌ర్ అనీల్ కుంబ్లే కొద్ది రోజులు టెస్టుల్లో జ‌ట్టును న‌డిపించాడని, ప్ర‌స్తుతం భార‌త టీ-20 జ‌ట్టులో వైస్ కెప్టెన్‌గా బుమ్రాను ఎంపిక చేయాల‌ని త‌న అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు సెహ్వాగ్‌. రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసినా చేయ‌క‌పోయినా బుమ్రాను మాత్రం వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయాల‌ని త‌న అభిప్రాయంను వ్య‌క్త‌ప‌రిచాడు మాజీ డాషింగ్ ఓపెన‌ర్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: