ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ఇక అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పొందేందుకు అటు  అందరూ సిద్ధమయ్యారు ఇక 25% ప్రేక్షకులకు స్టేడియంలోకి అనుమతి ఉండటంతో కొంత మంది ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి  రెడీ అయితే మరికొంతమంది టీవీలకు అతుక్కుపోయి ఒక బంతి కూడా మిస్ అవ్వకుండా మ్యాచ్ వీక్షించేందుకు రెడీ అవుతున్నారు. ఇకపోతే  ఇటీవలి కాలంలో ఐపీఎల్ కారణంగా ఎంతో మంది యువ ఆటగాళ్లు అవకాశాలను దక్కించుకుంటారు.


 అద్భుతంగా సత్తా చాటి ఇక అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు అంతర్జాతీయ క్రికెట్ లో తెలుగు క్రికెటర్లు చాలా తక్కువమంది కనిపించేవారు. కానీ ఇటీవలి కాలంలో మాత్రం మన యువ తెలుగు క్రికెటర్లు సత్తా చాటుతున్నారు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో చాలామంది తెలుగు క్రికెటర్ల అవకాశం దక్కించుకున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలా ఐపీఎల్లో ఇక ఈ సీజన్ లో ఆడుతున్న తెలుగు క్రికెటర్లు ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.


 సీనియర్ తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ లో కొనసాగుతున్నాడు. ఇక భారత క్రికెట్లో కీలక బౌలర్ గా కొనసాగుతున్న మహమ్మద్ సిరాజ్ అటు ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో ఉన్నాడు. యువ ఆటగాడు భరత్ వర్మ చెన్నై సూపర్ కింగ్స్ కి సెలెక్ట్ అయ్యాడు.  ఇక మరో తెలుగు క్రికెటర్ శ్రీకర్ భరత్ ను ఢిల్లీ కాపిటల్ జట్టు సొంతం చేసుకుంది. ఇంకో తెలుగు క్రికెటర్ అయిన సివి మిలింద్ ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక వీరితో పాటు రాహుల్ బుద్ధి ముంబై ఇండియన్స్ లో కొనసాగుతున్నాడు. ఇక ఠాగూర్ తిలక్  వర్మ కూడా ముంబై ఇండియన్స్ లోనే చోటు దక్కించుకున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: