మొన్నటి వరకు వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇటీవలి కాలంలో మాత్రం వరుస పరాజయాలతో సతమతమవుతుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విరాట్ కోహ్లీ పేలవమైన ఫామ్ జట్టుకు ఎంతో మైనస్ గా మారిపోతుంది. ఒకప్పుడు పరుగుల వరద పారించి సెంచరీలతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ ఇప్పుడు డబల్ డిజిట్ స్కోర్ చేయడానికి కూడా ఎంతగా ఇబ్బంది పడుతు ఉండటం అభిమానులను ఎంతో అసంతృప్తికి గురి చేస్తోంది.


 ప్రతి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ రాణిస్తారని ఆశగా ఎదురు చూడటం చివరకు విరాట్ కోహ్లీ వికెట్ చేజార్చుకోగానే నిరాశ పడటం అభిమానులంతా అయింది. కానీ ఇటీవలే గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం విరాట్ కోహ్లీ అర్థ శతకం సాధించి అభిమానులందరినీ కూడా ఆనందంలో ముంచేశాడు. ఇక విరాట్ కోహ్లీ ఆట తీరు చూస్తే మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు అని అర్థమయింది అంటు అభిమానులు అనుకున్నారు. ఇదే విషయంపై ఇటీవలే భారత దిగ్గజ బ్యాట్స్మెన్ సునీల్ గావస్కర్ స్పందించాడు. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి బెంగళూరు జట్టు కూడా ఇదే ఆశిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు.


 ఐపీఎల్ లో భాగంగా పది మ్యాచ్లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 5 విజయాలు 5 ఓటములతో కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్ లోకి రావడం బెంగళూరు జట్టుకు ఊరటనిచ్చే అంశం అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇక కోహ్లీ ఒక్కసారి గాడిలో పడి అర్థ శతకం సాధిస్తే మిగతా మ్యాచ్లకు ఇలాగే రాణించడానికి దోహదపడుతుంది. ఇలాంటి కీలక బ్యాట్స్మెన్ మంచి పరుగులు బెంగళూరు కు ఎంతో కలిసి వచ్చే అంశం.. గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లి క్రీజులో ఉన్న సమయంలో అతనికి కాలి కదలికలు బాగున్నాయి అంటూ వ్యాఖ్యానించాడు సునీల్ గావస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి: