గత కొంత కాలం నుంచి ద్వైపాక్షిక సిరీస్ లలో అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్న ఆకట్టుకుంటున్న టీమిండియా అంతర్జాతీయ టోర్నీల్లో మాత్రం పేలవ ప్రదర్శనతో నిరాశపరుస్తుంది అన్న విషయం తెలిసిందే. టి20 వరల్డ్ కప్ లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా ఆశించిన స్థాయిలో రాణించలేదు. కనీసం సెమీఫైనల్లోకి అడుగుపెట్టకుండానే గ్రూప్ దశలోనే ఇంటి బాట పట్టింది. ఇప్పుడు ఆసియా కప్లో కూడా ఫైనల్లో అడుగుపెట్టకుండా సూపర్ 4 తోనే సరిపెట్టుకుని వెనుతిరిగింది అనే విషయం తెలిసిందే.


 టి20 ప్రపంచ కప్ సమయంలో టీమ్ ఇండియా జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు విరాట్ కోహ్లీ. ఇప్పుడు ఆసియా కప్లో భాగంగా రోహిత్ శర్మ సారథిగా వ్యవహరించాడు.  కెప్టెన్ ఎవరు అయినప్పటికీ కూడా అటు టీమిండియా  ఆట తీరులో  మాత్రం మార్పులు రావడం లేదు అని చెప్పాలి. ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా బాగా రాణించకపోవడానికి కారణం కెప్టెన్సీ కాదని.. టీ20 లకు జట్టు ఎంపికలో లోపాలు ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చాడు.


 గత ఏడాది ప్రపంచ కప్లో ఓడినప్పుడు విరాట్ కోహ్లీనీ కెప్టెన్సీ నుంచి మార్చాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆసియా కప్ లో టీమిండియా ఇంటి ముఖం  పట్టడంతో రోహిత్ కెప్టెన్సీపై  కూడా విమర్శలు చేస్తున్నారు. జట్టులో  కెప్టెన్సీ సమస్య అనేది ఏమీ లేదు అన్నది నా అభిప్రాయం.. ఎందుకంటే జట్టు ఎంపికలో లోపాలవల్ల టీమిండియా ఓడిపోతుంది. గత ఏడాది టి20 వరల్డ్ కప్  నుంచి ఎంతోమంది ఓపెనర్లను పరీక్షించారు. సరైన ప్రణాళిక లేకపోవడంతోనే ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయారు  అంటూ ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అక్టోబర్లో ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే వరల్డ్ కప్ లో టీమిండియా ఎలా రాణించ బోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: