అందరికీ తెలుసు మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసిబి పోలీసులు అరెస్టు చేసినట్లు. వందల కోట్ల రూపాయల ఇఎస్ఐ కుంభకోణం బయటపడినప్పటి నుండి తనను అరెస్టు చేస్తారనే అనుమానం అచ్చెన్నకుంది. దానిక తగ్గట్లుగానే గురువారం అర్ధరాత్రి తర్వాత పోలీసుల సహకారంతో ఏసిబి అధికారులు నిమ్మాడలోరి సొంతింట్లోనే మాజీమంత్రిని అరెస్టు చేశారు. అచ్చెన్నను అరెస్టు చేసినపుడు స్ధానికులు కూడా చాలామందే ఉన్నారు ఇంటి దగ్గర.  వాస్తవం ఇదైతే అచ్చెన్నను కిడ్నాప్ చేశారని, ఆయన ఆచూకి తెలియటం లేదంటూ చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపాడు.

 

సుమారు రూ. 900 కోట్ల ఇఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుదే ప్రధాన పాత్రగా విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంటు దర్యాప్తులో బయటపడింది. దాని ఆధారంగానే ఏసిబి అధికారులు యాక్షన్లోకి దిగారు.  ముందుగా నోటీసు ఇవ్వలేదని, కిడ్నాప్ తర్వాత మాజీ మంత్రి అచూకీ లభించటం లేదని, కుటుంబసభ్యులకు కూడా మాట్లాడే అవకాశం దొరకటం లేదని బుర్రకు తోచినట్లుగా చంద్రబాబునాయుడు ట్వీట్లు చేస్తున్నాడు. అవినీతి ఆరోపణలపై అచ్చెన్నాయుడును అరెస్టు చేసినట్లు ఏసిబి అధికారులు స్పష్టంగా ప్రకటించిన తర్వాత కూడా అచ్చెన్న కిడ్నాప్ అయ్యాడని చెప్పటం చంద్రబాబుకు మాత్రమే చెల్లింది.

విచిత్రమేమిటంటే 100 మంది పోలీసులతో కిడ్నాప్ చేయించిన  అచ్చెన్నను  ఎక్కడికి తీసుకెళ్ళారో తెలీదట, ఎందుకు కిడ్నాప్ చేశారో కూడా తెలీదంటూ గోల చేస్తున్నాడు. తాను ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా చివరకు కుటుంబసభ్యులతో కూడా ఫోన్లో మాట్లాడనీయటం లేదని ఆరోపణలు చేయటమే విచిత్రంగా ఉంది. ఒకసారి అరెస్టు చేసిన తర్వాత ఎవరితో కూడా సదరు వ్యక్తిని ఫోన్లో మాట్లాడించరన్న ఇంగితం కూడా చంద్రబాబుకు లోపించటమే ఆశ్చర్యంగా ఉంది. ఏదేనా ఉంటే కోర్టులో చెప్పుకోవాలి, బెయిల్ కోసం ప్రయత్నం చేసుకోవాల్సిందే కానీ మధ్యలో ఇష్టం వచ్చిన వారితో మాట్లాడుతానంటూ నిబంధనలు అంగీకరించవన్న విషయం అందరికీ తెలుసు.

 

 అచ్చెన్న కిడ్నాప్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హోంశాఖ మంత్రి సుచరితే సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేయటమే విడ్డూరం. ఒకవైపు ఏసిబి అధికారులు తాము అచ్చెన్నను అరెస్టు చేసినట్లు ప్రకటించిన తర్వాత కూడా కిడ్నాప్ జరిగిందని గోల చేయటంలో అర్ధమే లేదు. అరెస్టంటూ జరిగిపోయింది కాబట్టి ఇక ఏమైనా ఉంటే తేల్చుకోవాల్సింది కోర్టులోనే అన్న విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. అయినా సరే గోల చేయటం, ప్రభుత్వంపై బురద చల్లటమే టార్గెట్ గా పెట్టుకున్నారు కాబట్టే కావాలనే గోల చేస్తున్నాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: