గతంలో భారత జట్టులో కీలక ఆటగాడిగా బౌలర్గా ఉన్న శ్రీశాంత్ ఆ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్ కారణంగా నిషేధానికి గురయ్యాడు  అన్న విషయం తెలిసిందే. బీసీసీఐ  శ్రీశాంత్ పై  పూర్తిస్థాయి నిషేధం విధించడంతో పూర్తిగా క్రికెట్ ఆటకు దూరం అయిపోయాడు. ఇటీవల శ్రీశాంత్ బిసిసిఐ తనపై విధించిన నిషేధాన్ని తగ్గించాలంటూ చెప్పడంతో బిసిసీఐ  తన పై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.  ఇటీవలె శ్రీశాంత్ పై ఉన్న నిషేధం పూర్తిగా తొలగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మళ్ళీ భారత జట్టులో స్థానం సంపాదించేందుకు శ్రీశాంత్ ఎంతగానో ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే తమ జట్టు తరఫున శ్రీశాంత్ కు అవకాశం ఇచ్చేందుకు కేరళ క్రికెట్ సంఘం నిర్ణయించింది అన్న విషయం తెలిసిందే.




 ఇక త్వరలో కేరళ క్రికెట్ సంఘం నిర్వహించబోయే స్థానిక టి20 క్రికెట్ లో టీమిండియా మాజీ క్రికెటర్ శ్రీశాంత్ ఆడనున్నాడు. గతంలో భారత జట్టులో స్పీడ్  బౌలర్ గా ఎంతో మంది బ్యాట్మెన్ లను  వణికించిన శ్రీశాంత్ దాదాపు ఐదేళ్ల నిషేధం తర్వాత మొదటి సారి మళ్ళీ బంతి  పట్టి మైదానంలోకి దిగనున్నాడు. అయితే ప్రస్తుతం ఏడేళ్ల నిషేధం తర్వాత శ్రీశాంత్ ఎలా రాణిస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే స్పాట్ ఫిక్సింగ్ కారణంగా శ్రీశాంత్ పై బీసీసీఐ  నిషేధం విధించగా న్యాయపోరాటం చేసిన శ్రీశాంత్ తనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసేలా విజయం సాధించాడు.



 అయితే దాదాపు ఏడేళ్ల నిషేధం తర్వాత శ్రీశాంత్ మొదటిసారి బంతి పట్టి మైదానంలోకి దిగి టీ20 ఆడేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి అంతకుముందు ఫామ్ లోకి వచ్చేందుకు ప్రస్తుతం తీవ్ర స్థాయిలో ప్రాక్టీస్ మొదలు పెట్టాడు శ్రీశాంత్. అంతేకాదు క్రికెట్లో మళ్లీ రాణించి  భారత సెలెక్టర్లు చూపును ఆకర్షిస్తా అంటూ గతంలో ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా గతంలో శ్రీశాంత్ క్రికెట్కు దూరమై బాగా కండలు పెంచి అందరిని సోషల్ మీడియా వేదికగా ఆకర్షించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: