చివరకు మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ ఇక ఇప్పుడు జట్టులో ఒక సాదా సీదా ఆటగాడిగా కొనసాగుతున్నాడు. కేవలం ఐదు నెలల వ్యవధిలోనే మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి వివాదాస్పదంగా దూరమయ్యాడు విరాట్ కోహ్లీ. మొదట టి20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోగా.. ఆ తర్వాత బిసిసిఐ అతని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించింది. ఇక ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. దీంతో ఇక ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ ఒక సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగుతూ ఉండడం గమనార్హం.


 కాగా మరికొన్ని రోజుల్లో స్వదేశంలో వెస్టిండీస్తో వన్డే టి20 సిరీస్ ఆడేందుకు సిద్దం అవుతుంది టీమిండియా. గాయం కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమైన రోహిత్ శర్మ మళ్ళి కెప్టెన్గా ఎంట్రీ ఇచ్చేసాడు. ఇకపోతే ఇటీవల వన్డే టి20 జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇందులో కెప్టెన్గా రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా కె.ఎల్.రాహుల్ కొనసాగుతుండగా విరాట్ కోహ్లీ సాదాసీదా ఆటగాడిగానే కొనసాగుతున్నాడు. అయితే మొదటిసారీ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ సారథ్యంలో ఆడబోతున్నాడు. అయితే ఇప్పటివరకూ రెగ్యులర్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీ వివిధ కారణాలతో జట్టుకు దూరమైనప్పుడు రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు.


 కానీ ఇప్పటివరకు ఒక్క సారి కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ ఆడలేదు అనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక మొదటి సారి విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ గా ఆడుతున్న మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలా రాణించ బోతున్నాడు  అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే 2029 నుంచి వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది అని టాక్ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు కెప్టెన్సీ ఒకరి నుంచి ఒకరికి మార్పు జరిగిన నేపథ్యంలో ఇద్దరు ఆటగాళ్ళు వ్యవహార శైలి మైదానంలో ఎలా ఉండబోతుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది అనే చెప్పాలి. ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆడటమంటే కోహ్లీ సరికొత్త సవాల్ ను ఎదుర్కోవడమే అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: