గత కొంత కాలం నుంచి ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఫుల్ ఫామ్ లో కొనసాగుతున్నాడు రవీంద్ర జడేజా. ఇక అసలు సిసలైన ఆల్రౌండర్గా అద్భుతమైన ప్రదర్శన తో ఇరగదీస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతి సారి కూడా జట్టును గట్టెక్కించడానికి తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు రవీంద్ర జడేజా. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ ఇండియా టెస్ట్ మ్యాచ్ ఆడుతూ ఉన్నది. టెస్ట్ మ్యాచ్ లో కూడా మరోసారి అదరగొట్టాడు జడేజా. ఇటీవలే 98 పరుగుల వద్ద టీమ్ ఇండియా ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అదే సమయంలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా, రిషబ్ పంత్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు. రిషబ్ పంత్ 107 బంతుల్లో 146 పరుగులు చేశాడు.


 ఇక మరోవైపు రిషబ్ పంత్ కు సహకారం అందిస్తూనే రవీంద్ర జడేజా సైతం 88 పరుగులు తో ఆకట్టుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు ఆట లో భాగంగా ఇటీవల రవీంద్ర జడేజా సెంచరీ పూర్తి చేసుకున్నాడు అనే విషయం తెలిసిందే. 104 పరుగులు చేసిన రవీంద్ర జడేజా వికెట్ కోల్పోయాడు. అయితే సూపర్ సెంచరీతో అదరగొట్టిన రవీంద్ర జడేజా ఇటీవలే ఒక అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు అనేది తెలుస్తుంది. ఏడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి ప్రత్యేక కాలెండర్ ఇయర్లో రెండు సెంచరీలు సాధించిన నాలుగో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు జడేజా.


 ఇక ఈ మ్యాచ్లో 416 పరుగులు చేసిన టీమిండియా చివరికి ఆలౌట్ అయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇప్పుడు వరకు టెస్టుల్లో ఏడవ స్థానంలో బ్యాటింగ్కు దిగి ఓకే ఏడాది క్యాలెండర్ ఇయర్లో రెండు సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కపిల్ దేవ్,మహేంద్ర సింగ్ ధోనీ, హర్భజన్ సింగ్ లు కొనసాగుతున్నారు. 1986 లో కపిల్ దేవ్ ఒకే క్యాలెండర్ ఇయర్లో రెండు సెంచరీలు చేస్తే 2009లో మహేంద్రసింగ్ ధోని ఈ ఫీట్ సాధించాడు. 2010లో స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ అరుదైన ఘనత సాధించి అందరినీ ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: