ఇటీవలే ఇంగ్లాండ్ భారత్ మహిళల జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్ లో భాగంగా మూడో వన్డే మ్యాచ్ లో భారత బౌలర్ దీప్తి శర్మ ఆస్ట్రేలియా బ్యాటర్ చార్లీ డీన్ ను మన్ కడింగ్ రూల్ ప్రకారం అవుట్ చేయటం అంతర్జాతీయ క్రికెట్లో చర్చనీయాంశంగా  మారిపోయింది అన్న విషయం తెలిసిందే. క్రికెట్లో మన్కడింగ్ విధానం ఉన్నప్పటికీ కాస్త క్రీడా స్ఫూర్తితో ఆలోచించి ఉంటే బాగుండేది అని కొంతమంది దీప్తి శర్మ పై విమర్శలు చేశారు. దీప్తి శర్మ చేసింది తప్పు అంటున్న వారు ముందుగా ఆ రూల్స్ పెట్టిన వారిని ప్రశ్నించాలి అంటూ ఇంకొంతమంది దీప్తి శర్మకు మద్దతుగా నిలుస్తూ ఉండడం గమనార్హం.


 అయితే దీప్తి శర్మ బంతి వేయకముందే డీన్ క్రీజు దాటడంతో నిబంధన ప్రకారం ఆమెను రన్ అవుట్ చేసింది దీప్తి శర్మ.. దీంతో అందరూ క్రీడా స్ఫూర్తి అంశం గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే దీనిపై భారత కెప్టెన్ హార్మోన్ ప్రీత్ కౌర్ స్పందిస్తూ వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఈ విషయంపై చర్చ మాత్రం ఆగలేదు అని చెప్పాలి. ఇక ఎట్టకేలకు స్వయంగా బౌలర్ దీప్తి శర్మ కూడా ఇదే విషయంపై స్పందించడం గమనార్హం. ఇటీవల స్వదేశానికి తిరిగి వచ్చిన దీప్తి శర్మ కోల్కతా లోనే మీడియా ముందు మాట్లాడింది.  ఇక రన్ అవుట్ విషయంలో మేము వ్యూహంతో సిద్ధమయ్యాం అంటూ చెప్పుకొచ్చింది.


 అప్పటికే ఆస్ట్రేలియా బ్యాటర్ చార్లీ డీన్ ను మేము పలుమార్లు హెచ్చరించాం. అయినప్పటికీ ఆమె మళ్ళీ మళ్ళీ క్రీజు దాటి ముందుకు వెళ్ళింది. ఇక ఈ విషయాన్ని ఎంపైర్లకు కూడా ముందుగానే చెప్పాము. అయినప్పటికీ ఆమె తీరులో మార్పు రాలేదు. చివరికి చేసేదేమీ లేక.  నిబంధనల ప్రకారమే ఆమెను అవుట్ చేసాము. అలా కాకుండా ఇంకేం చేయగలం చెప్పండి అంటూ స్వయంగా బౌలర్ దీప్తి శర్మ వివరణ ఇచ్చింది.  అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్ హీతర్ నైట్.. మ్యాచ్ ముగిసిపోయింది నిబంధనల ప్రకారం చార్లీ అవుట్ అయింది. మ్యాచ్ తో పాటు సిరీస్ గెలిచేందుకు భారత్కు అన్ని విధాల అర్హత ఉంది. అయితే రన్ అవుట్ గురించి హెచ్చరించారు అన్నదాంట్లో నిజం లేదు. కాకపోతే రూల్ ప్రకారం అవుట్ చేశారు కాబట్టి హెచ్చరించాల్సిన అవసరం కూడా లేదు అంటూ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: