ఇండియాలో రానురాను టెక్నాలజీ మరింత ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కటి మనకి అందుబాటులో ఉన్నాయి.. అయితే ఇప్పుడు దేశవిదేశాల తో పోటీ పడేందుకు మన భారతదేశంలో కూడా.. రాబోయే రోజుల్లో ఇక పై 5g సేవలు కూడా అందుబాటులో తెచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం తన అడుగులను వేస్తున్నది. ఈ విషయంపై ఇదివరకే ప్రధానమంత్రి కార్యాలయంలో టెలికామ్ శాఖ కూడా ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఐదు సేవలకు సంబంధించి సిఫార్సులను వచ్చే నెల (మార్చి) చివరి నాటికి అందించాలని టెలికామ్ శాఖ తెలియజేస్తోంది.


వివిధ బ్యాండ్ ల లో లభ్యమయ్యే స్పెక్ట్రమ్ లను వేలం వేసేందుకు వాటి యొక్క ధరలు, షరతులకు సంబంధించిన విషయాలను సిఫార్సు చేయనుంది. అయితే 5-g సేవలు మన దేశంలో అందుబాటులో వస్తే ప్రస్తుతం ఉన్న..4g సేవలతో పోలిస్తే వీటి స్పీడ్ 10 రెట్లు ఎక్కువగా ఇక 5g సేవలకు సంబంధించి ట్రామ్ ఏర్పాటు చేస్తున్నది. ఇక వీటి స్పీడు..700 MHZ నుంచి 526-698 MHZ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ వేలానికి పాటించవలసిన కొన్ని పద్ధతులను రూపొందిస్తున్నారు. ఇక ఇతర టెలికామ్ సంస్థలు కూడా5-G  సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి చాలా సిద్ధమైనట్లు తెలుస్తోంది.


అయితే ప్రకటన ధరలను తక్కువగా ఉండేలా చూసుకోవాలని పరిశ్రమల వర్గాలు కేంద్రాన్ని కోరడం జరిగింది. అయితే ప్రస్తుతం 5g నెట్ వర్క్ రాకముందే.. అందుకు సంబంధించిన మొబైల్స్ మాత్రం భారత్లోకి ఎప్పుడు విడుదల అయ్యాయి. ఇక ఇప్పటి వరకు ఎన్నో బ్రాండెడ్ గల సంస్థలు 5g మొబైల్స్ ను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇక రాబోయే రోజుల్లో మనం కేవలం 5g మొబైల్స్ ని ఉపయోగించుకునేలా ఉండవచ్చునేమో.. ఏదిఏమైనా కాలానికి అనుగుణంగా భారత దేశం కూడా అందరితో పోటీపడి టెక్నాలజీ లో నడుస్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: