యాంకర సుమ.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎన్నో ఏళ్లుగా యాంకరింగ్ చేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.. వయసు మీద పడుతున్న సరే ముఖానికి మేకప్ రుద్ది ఇప్పటి కుర్ర పిల్లలా అందరిని ఆకట్టుకుంటుంది. ఇప్పటికి కాదు ఇంకా మరో ఐదేళ్లు అయినా ఆమె క్రేజ్ అలాగే కొనసాగుతుంది.. ఇందులో ఏలాంటి సందేహం లేదు.. 

 

ఇకపోతే సుమ కనకాల.. రాజీవ్ కనకాల గురించి గత కొద్దీ రోజులుగా కొన్ని వార్తలు హాల్ చల్ చేస్తున్నాయ్.. ఆ వార్తలు చూస్తే ఎవరైనా సరే షాక్ అయిపోతారు.. అదేనండి.. రాజీవ్ కనకాల.. సుమ కనకాల విడాకులు తీసుకున్నారు అని.. గత నాలుగేళ్లుగా వేరు వేరుగా జీవిస్తున్నారు అని సోషల్ మీడియాలో ప్రచారం భారీగా జరుగుతుంది. దీంతో అందరూ కూడా షాక్ అయిపోయారు..

 

ఎప్పుడు బుల్లితెరపై నవ్వుతు నవ్విస్తూ ఉండే సుమక్క జీవితంలో ఇంత విషాదం ఉందా అయ్యో అని బాధ పడ్డారు.. అయితే ఇంకా ఈ నేపథ్యంలోనే సుమ కనకాలకు ఏ మెసేజ్ లు వస్తాయో రాజీవ్ కనకాల బయటపెట్టేశాడు.. అయితే అది కూడా ఫన్నీగానే అనుకోండి.. అయితే అది బయటపెట్టింది ఇప్పుడు కాదు.. ఎప్పుడో చెప్పాడు. కానీ ఆ వీడియో వైరల్ అవుతుంది. 

 

ఎం అని చెప్పాడు అంటే? ''సుమకి మామూలు క్రేజ్ లేదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఆమెకు ఐ లవ్ యూ, పెళ్లి చేసుకుంటా అంటూ చాలా మెసేజ్‌లు పెడుతుంటారు. నువ్ ఇప్పుడు ఊ.. అను ఇప్పటికైనా పెళ్లి చేసుకుంటా.. రాజీవ్ నువ్ లక్కీ''అంటూ మెసేజ్‌లు పెడతారు అంటూ నవ్వుతూ తన భార్య గురించి చెప్పుకొచ్చారు రాజీవ్ కనకాల. 

 

ఇక సుమ కల్పించుకుని ఈ విషయాలు నాకు తెలియవు కాని.. నాకైతే ఎలాంటి మెసేజ్‌లు వస్తాయ్ అంటే.. పిల్లోడు అన్నం తినడం లేదు.. ఒకసారి మిమ్మల్ని చూపించమన్నాడు’, ''మా అత్తగారికి చాలా సీరియస్‌గా ఉంది.. మీరు ఒక్కసారి వచ్చి చూస్తే ఆవిడ మామూలు మనిషి అవుతారు’ ఇలాంటి హార్ట్ టచ్చింగ్ మెసేజ్‌లు బోలెడు వస్తుంటాయి'' అంటూ ఆమె చెప్పారు.. ఇలా ఎప్పుడు ఫన్నీగా ఉండే ఈ కపుల్ విడిపోయారు అంటే కాస్త బాధాకరమైన విషయం అనే చెప్పాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: