దీపిక అగర్వాల్ అసలు పేరు వీణ పొన్నప్ప.. 1990వ సంవత్సరం జనవరి 6వ తేదీన కర్ణాటక రాష్ట్రంలోని కొడగు అనే ప్రాంతంలో జన్మించింది. ఇక వీరి ఫ్యామిలీ అంతా బెంగళూరు లోని మైసూర్ లో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక విద్యాభ్యాసం విషయానికొస్తే, బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ పూర్తి చేసింది. అందరిలాగే ఈమె కూడా నటన మీద ఆసక్తితో మొదట సీఐడీ కర్ణాటక అనే సీరియల్లో పోలీస్ ఆఫీసర్ చార్వి పాత్రలో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందింది. హర హర మహాదేవ ,కిన్నెర వంటి సీరియల్స్‌లో కూడా నటించి అందరిని బాగా అలరించింది.
కన్నడ సినిమాల విషయానికి వస్తే, జాత్రి, దండుపాళ్యం 4, సీతారామ కళ్యాణం వంటి సినిమాలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రల్లో నటించింది. అంతేకాదు ఈమె తమిళ్ లో కూడా ప్రస్తుతం శివ మనసుల శక్తి వంటి సీరియల్ లో నెగటివ్ పాత్రలు పోషిస్తోంది. ఈ సీరియల్ తెలుగులో అగ్నిసాక్షి గా ప్రసారం అవుతోంది. మరోవైపు తెలుగులో ఈటీవీలో ప్రసారమవుతున్న నా పేరు మీనాక్షి అనే సీరియల్లో కూడా దీపిక అగర్వాల్ అనే పాత్రలో నెగిటివ్ రోల్ చేస్తోంది.