ఇప్ప‌టికే చైనా నుంచి పుట్టుకొచ్చిన క‌రోనాతో స‌త‌మ‌త‌మ‌వుతున్న వేళ‌.. భారత-చైనా దళాల మధ్య లడఖ్ లోని గాల్వామా వ్యాలీలో ఘర్షణ పెద్ద దుమారం రేపింది. ఈ ఘ‌ర్ష‌ణలో ఘర్షణలో 20 మంది భారతీయ సైన్యం వీర మరణం పొందిన తర్వాత చైనా మీద భారతీయుల ఆగ్రహజ్వాలలు మిన్ను ముడుతున్నాయి. దీంతో `బాయ్‌కాట్ చైనా` పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. ఈ క్ర‌మంలోనే  చైనా యాప్స్ అన్నింటినీ ఫోన్ల నుంచి డెలీట్ చేసేస్తున్నారు. ఇంకొంద‌రు చైనా ఫోన్లే వ‌ద్ద‌నుకుంటున్నారు. 

 

వాస్త‌వానికి భారతదేశంలో చాలాకాలం నుండి చైనా ఉత్పత్తుల వాడకం అధికంగా ఉంది. నిత్యం ఉపయోగించే వస్తువుల నుండి, సెల్ ఫోన్లు, చైనా వారు తయారుచేసిన సోషల్ మీడియా యాప్ లు వాడకుండా బ్యాన్ చేయాలని ప్రచారం జరుగుతోంది. ఈ క్ర‌మంలోనే  చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌కు ప్రత్యామ్నాయం కోసం మొబైల్ ప్రియులు వెతుకుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో భారత స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ రాబోయే వారాల్లో మూడు స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్‌ చేయబోతోంది. అది కూడా బ‌డ్జెట్ ధ‌ర‌లోనే. 

 

త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌బోయే స్మార్ట్‌ఫోన్ల‌లో  ప్రీమియం ఫీచర్లతో పాటు ఆకర్షణీయమైన డిజైన్ అందించనున్నారు. ఈ మేక‌ర కంపెనీ పేర్కొంది. ఇక ఈ ఫోన్ల‌ ధర రూ .10,000 లోపు ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇదే జరిగితే, రాబోయే మైక్రోమాక్స్ ఫోన్లు మార్కెట్లో ఉన్న అనేక చైనీస్ ఫోన్‌లకు గట్టి పోటీని ఇవ్వగలవు. వాస్త‌వానికి ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన మైక్రోమాక్స్ చాలా కాలంగా చైనా ఫోన్ల ధాటికి ఏ ఫోన్‌ను మార్కెట్లోకి విడుల చేయలేదు.  అయితే ఇప్పటికే చైనా ఫోన్లను బాయ్ కాట్ చేయాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేపథ్యంలో దేశీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ మైక్రోమాక్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ముందుకు దిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: