సాధారణంగానే మన జీమెయిల్ అడ్రస్ తో
యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తే.. జీమెయిల్ ఐడి పేరే
యూట్యూబ్ ఛానల్ పేరుగా మారుతుంది. ఒకవేళ
యూట్యూబ్ ఛానల్ పేరు మనకి నచ్చినట్లు మార్చుకుంటే అది జీమెయిల్ లో కూడా మారుతుంది. సో, జీమెయిల్ నేమ్ చేంజ్ చేసినా.. లేదా
యూట్యూబ్ నేమ్ చేంజ్ చేసినా.. రెండు ప్లాట్ ఫామ్స్ లో పేరు చేంజ్ అవుతుంది. దీని వల్ల కొందరికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని గమనించిన యూట్యూబ్.. జీమెయిల్ ఐడి చేంజ్ చేయకుండానే..
యూట్యూబ్ ఛానల్ నేమ్ చేంజ్ అయ్యేలా ఒక అప్డేట్ విడుదల చేసింది. దీంతో నార్మల్ యూజర్స్ తో పాటు బాగా పాపులారిటీ కలిగిన వినియోగదారులు సైతం తమ ఛానల్ నేమ్స్ మార్చేశారు.
అయితే పాపులర్
యూట్యూబ్ క్రియేటర్స్ తమ ఛానల్ పేరు మార్చుకొని ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. ఎందుకంటే ఛానల్ పేరు మార్చగానే వెరిఫికేషన్ బ్యాడ్జి మాయమైపోయింది. మళ్లీ వెరిఫైడ్ బ్యాడ్జి పొందాలంటే మొదటినుంచి ప్రాసెస్ మొదలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇదేం తలనొప్పి
రా బాబు అంటూ చాలా మంది ప్రముఖ
యూట్యూబ్ క్రియేటర్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటువంటి క్రియేటర్స్ సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు
యూట్యూబ్ నడుంబిగించింది. బాగా ఫాలోయర్స్ ఉన్న క్రియేటర్స్ కి మళ్ళీ వెరిఫైడ్ బ్యాడ్జి ఇచ్చేందుకు
యూట్యూబ్ సిబ్బంది పని చేస్తోంది కానీ ముందస్తుగా హెచ్చరించకుండానే మార్పులు చేయడం అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది.
ఇక కొత్తగా ఛానల్ నేమ్ చేంజ్ చేసుకోవాలి అనుకున్నవారు కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అవ్వండి.
2. మీ ఛానల్ ప్రొఫైల్ ఓపెన్ చేయండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
3. ఇప్పుడు మీ ఛానల్ నేమ్ ని ఎడిట్ చేయొచ్చు లేదా పూర్తిగా మార్చవచ్చు.
4. ఛానల్ నేమ్ మార్చిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసి సేవ్ చేయండి. ఇదే స్టెప్స్ లో ఫోటో కూడా చేంజ్ చేయొచ్చు.