ప్రస్తుతం మారుతున్న సాంకేతికల ప్రకారం సరికొత్త స్మార్ట్ ఫోన్స్ విడుదల అవుతూనే ఉన్నాయి. దేశంలో జనాభా విపరీతంగా పెరిగి పోవడంతో ఇక మొబైల్ ఫోన్ వినియోగం కూడా ఎక్కువగానే ఉన్నది. కొంతమంది ఒక మొబైల్ కంటే ఎక్కువ మొబైల్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. వాటి తగ్గట్టుగానే కొత్త టెక్నాలజీ మొబైల్స్... విడుదల కాగానే పాత మొబైల్ ని పక్కకు పడేస్తున్నారు. ఇలా ఎన్నో ఫోన్లు వాడకుండానే పక్కకి పాడేస్తున్నారు.. అలా పక్కకు పడేసిన ఫోన్లలోనూ మనం కొత్త ఆలోచనతో వేటికైనా ఉపయోగించుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

మన పాత మొబైల్ కి కేవలం కెమెరా ఫ్యూచర్ ఉంటే చాలు. దానిని వైర్లెస్ సెక్యూరిటీగా వాడుకోవచ్చు. ఇప్పటికే మార్కెట్ లో సీసీ కెమెరా వంటివి బాగా అప్డేట్ తో వస్తూనే ఉన్నాయి. ఇక అలాంటిది మొబైల్స్ ను సీసీ కెమెరా గా మార్చుకోవడానికి కొన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉన్నవి.. వాటిని వాడుకోవడం వల్ల ఒక రూపాయి ఖర్చు లేకుండా.. మొబైల్ ని సీసీ కెమెరా గా ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు తమ ఇంటికి సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యం అని చెప్పవచ్చు..

ఇక అంతే కాకుండా మనం ఏదైనా బిజినెస్ పరంగా షాపులు ఉన్నట్లయితే వాటికి ఎంతో చక్కగా ఉపయోగపడతాయి సీసీ కెమెరాలు. మార్కెట్లో అందుబాటులో ఉండేటువంటి అప్లికేషన్ల డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా మన పాత మొబైల్ ని ప్రస్తుతం వాడుతున్న మొబైల్ ఫోన్ కి లింక్ చేసుకొని.. మన ఇళ్ళల్లో ఎలాంటివి జరుగుతాయో ఒకసారి చూడవచ్చు. ముఖ్యంగా గూగుల్ ios వంటి అప్లికేషన్లలో చాలా యాప్స్ ఉన్నాయి. కొన్ని అప్లికేషన్లు ఇందులో సరి కొత్త ఫీచర్లు కూడా అందిస్తున్నాయి. మీ పాత మొబైల్ ను ఏదైనా ఒక గదిలో ఉంచి అక్కడ జరిగే సంఘటనలను చూడవచ్చు ఈ యాప్ను ల్యాప్ టాప్ కూడా ఉపయోగించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: