ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసులు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న కార్యక్రమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు . ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ట్రాఫిక్ నియమాలను, హెచ్చరికలను మీమ్స్ రూపంలో చెబుతున్నారు. ఇప్పటికే పలు మీమ్స్ ద్వారా పోలీసులు ట్రాఫిక్ నియమలపై అవగాహన కల్పించగా తాజాగా ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ మీమ్ తో నవ్వించి ..హెచ్చరించారు. మీమ్ లో ఈ సారి ర‌వితేజ తో పాటు బ్ర‌హ్మానందం ను వాడుకున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా స్టేటస్ బ్యాచ్ ఎన్నో స్టేటస్ లు పెట్టి మహిళలకు శుభాకాంక్షలు చెబుతారు. అలాంటి వారిని టార్గెట్ చేసుకుని..రవితేజ బ్రహ్మానందం మీమ్ ను పోస్ట్ చేసారు. ఈ మీమ్ లో స్టేటస్ తరవాత పెట్టొచ్చు.. ముందని సూచించారు. "ఫస్ట్ సేఫ్టీ..తరవాతే స్టేటస్..టూ వీలర్ పై మీ భార్య, పిల్లలు, అమ్మ వెళ్ళేటప్పుడు వాళ్ళు హెల్మెట్ పెట్టుకునేలా చూడండి..వారిని సురక్షితంగా ఉంచండి" అంటూ ట్వీట్ చేశారు .

ఇదిలా ఉండగా సైబరాబాద్ పోలీసులు బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని కొద్ది రోజులుగా సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్ హెచ్ 33 మీద బైక్ పై ప్రయాణించే సమయంలో నడిపే వ్యక్తితో పాటూ వెనక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకున్న ఫోటోను పోలీసులు ట్వీట్ చేసారు . ఈ ట్వీట్ లతో కొంతమంది అయినా మారుతారని పోలీసులు ఆశిస్తున్నారు. నిజానికి పోలీసుల కష్టాన్ని అభినందించాలి. వాహన దారుల ప్రాణాలు కాపాడటం కోసం రోజంతా రోడ్లపై డ్యూటీ చేయడమే కాకుండా...ఇలా సోషల్ మెడియాతోనూ అవగాహన కలిపిస్తున్నారు. మరి మనకోసం పోలీసులు అంత కష్టపడుతుంటే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నమా లేదా అన్నది మనమే ఆలోచన చేసుకోవాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: