మార్గాన్ని నిర్దేశించడంలో ఈ గూగుల్ మ్యాప్స్ మనకు చాలా బాగా సహాయపడుతాయి. మనం ఏదైనా తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు, నిర్దిష్ట ప్రదేశానికి చేరుకోవాలంటే.. ఎక్కువగా ఈ గూగుల్ మ్యాప్స్ పై ఆధారపడడం తరచూ జరుగుతూనే ఉంటుంది. ఇక అలాంటిది ఈ గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రజలకు మరింత చేరువ అవడానికి సరికొత్త ఆధునిక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది గూగుల్. అయితే ఈ గూగుల్ మ్యాప్స్ వినియోగదారులకు ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..


1.గూగుల్ మ్యాప్ సహాయంతో ఇతర ప్రదేశాలు రద్దీగా  ఉన్నప్పుడు వాటిని మనకు ముందుగానే చూపుతుంది.

2. ప్రస్తుతం మనం ఎక్కడికి వెళ్తున్నాము.. అక్కడ ఎంత రద్దీగా ఉందో మనకు ముందుగానే చూపుతాయి. తద్వారా మనం ఏ రూట్లో వెళితే మన గమ్యాన్ని చేరుకోవచ్చు అనే కొత్త ఫీచర్ ని కూడా ఈ గూగుల్ మ్యాప్ లో జోడించడం జరిగింది.

ఇవి ప్రజలు తాము చేరుకోబోయే నిర్దిష్ట ప్రదేశాలకు ఎటువంటి సమయం వృధా కాకుండా అతి తక్కువ సమయంలోనే వారి మార్గాలకు చేరవేసేందుకు సహాయపడతాయి. రద్దీగా ఉండే ప్రదేశాలను ముందుగానే రవాణా ఏజెన్సీల ద్వారా సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తాయి. ఇక ఈ ఫీచర్ వినియోగదారులు తమ ప్రయాణ సమయాన్ని వృధా చేసుకోకుండా, చక్కగా నిర్వహించడానికి ఈ గూగుల్ మ్యాప్ సహాయపడతాయి.


ఇకపోతే ఈ గూగుల్ అమెరికాలో గత సంవత్సరంతో పోలిస్తే,  ఈ మ్యాప్ లపై 50% మంది ఎక్కువగా ఈ గూగుల్ మ్యాప్స్ ను ఉపయోగిస్తున్నారు. ఇక ఈ కొత్త ఫీచర్లను చూసి గూగుల్ వంద దేశాలలో సుమారు పది వేల మందికి పైగా రవాణా ఏజెన్సీలకు రవాణా ను  అంచనా వేసి విస్తరించాలని నిర్ణయించుకుంది. ఈ ఫీచర్ లో బస్సు ప్రయాణం లేదా రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎంత రద్దీగా ఉందో మనకు ముందే చూపిస్తుంది. ఇక ఇలా తెలియడం వల్ల ప్రయాణికులు ముందుగా బస్సు ఎక్కాలా.. వద్దా అని నిర్ణయించుకుని , తదుపరి ఏం చేయాలో కూడా ఆలోచించుకునేందుకు వీలుగా ఉంటుంది. అంతే కాదు ఇందులో మరింత టెక్నాలజీని పొందుపరచి ప్రేక్షకుల సమయాన్ని ఆదా చేయడానికి తోడ్పడతామని గూగుల్ తెలుపుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: