చుట్టూ ఉన్న వాతావరలో కొన్ని కొన్ని విషయాలు గమనించినప్పుడు  వింతగానూ నవ్వు తెప్పించేవి గాను ఉంటాయి. ఆ  విషయాలు జరిగేటప్పుడు కంగారు పుట్టించినప్పటికీ..తరువాత ఆలోచించినప్పుడు నవ్వు పుట్టిస్తాయి. పెరటిలో ఓ పక్షి ఇంట్లోని సభ్యులను ఇబ్బంది పెట్టిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంది. నల్గొండ జిల్లా నకిరేకల్ ప్రాంతంలో నివాసముంటున్న వెంకన్న , ఉమారాణి దంపతులు తమ పెరట్లో అరటి చెట్లను పెంచుతున్నారు. తాజాగా ఆ అరటిచెట్టుకి అరటి గెల పండింది. ఉమారాణి ఆ అరటి చెట్టుకు ఉన్న అరటి పండ్లను కోయడానికి వెళ్ళినప్పుడు ఆ చెట్టు గెల బరువుకి వంగడంతో ఆ చెట్టుపై ఉన్న పక్షి గూడు కాస్త క్రింద పడినట్లు ఆమె గమనించింది. 
జాలిపడి ఆ పక్షి గూడును సరైన స్థలం లో చెట్టు పై అమర్చింది . ఈ క్రమం లోనే ఆ పక్షి గుడ్లను పెట్టి పొదిగింది ఈ క్రమంలోనే చెట్టు అరటి గెల దెబ్బకు మరింతగా వరిగింది దాంతో పిట్ట గూడు క్రింద పడేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. దింతో ఉమారాణి తన భర్త వెంకన్నను ఆ గూడును సరి చేయవలసింది గా కోరింది. ఈ క్రమం లోనే వెంకన్న ఆ గూడును సరిచేయబోయాడు అంతే తన గుడ్లను అపహరించేందు వచ్చారని అనుమానించి వారిని తరిమి కొట్టింది ఆ పక్షి . ఇలా వారు ఎప్పుడు పెరట్లోకి వచ్చినా వారిపైకి దాడి చేసేది.
కనీసం వారు తమ పెరట్లో గిన్నెలు తోముకోలేక పోయేవారు. బట్టలు ఉతుక్కోలేక పోయేవారు , పెరట్లో స్నానం కూడా  చేయలేక పోయేవారు ఈ క్రమం   లోనే వారు హెల్మెట్ పెట్టుకొని పక్షినుండి తప్పించు కోవాలనుకున్నారు. అప్పటినుండి వారు పెరట్లోకి వచ్చి పనిచేసుకోవాలనుకుంటే  కచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని వచ్చేవారు . ఉమారాణి దంపతులు ఇద్దరు పిల్లలతోనే వేగలేక పోతుంటే ఇప్పుడు ఈ పక్షి మమ్మల్ని ఇబ్బంది పెడుతోందని వాపోతున్నారు. ఈ  విషయం గురించిన  ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్స్ నవ్వుతు కామెంట్స్ పెడుతున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: