సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇలాంటి వీడియోలు కొన్ని నెటిజన్లు అందరినీ కూడా అబ్బురపరుస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.. ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తున్నది నిజమా అబద్దమా అని కూడా నమ్మలేని విధంగా అందరినీ ఆశ్చర్యపరిచే కొన్ని వీడియోలు అప్పుడప్పుడు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు చూసినప్పుడు ఇలాంటిది అసలు ఎలా సాధ్యమైందబ్బా అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగచిక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇప్పుడు వరకు ఎంతో మంది యువకులు బైక్ పై స్టంట్స్ చేయడం ఇక ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం లాంటివి ఎన్నోసార్లు చూశాము.


 కొన్ని కొన్ని సార్లు రిస్కీ స్టంట్స్ చేస్తూ ఎంతోమంది యువకులు ఇక ప్రమాదాలను కొనితెచ్చుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా స్టంట్స్ చేయాలి అంటే ఒక పెద్ద స్పోర్ట్స్ బైక్ కావాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక అంకుల్ మాత్రం స్టంట్స్ చేయడానికి పెద్ద పెద్ద బైకులు అవసరం లేదు చిన్న స్ప్లెండర్ బైక్ ఉన్నా సరిపోతుంది అని నిరూపించాడు. అంతేకాదు యువత ఎంతో రిస్క్ చేసి చేసే స్టంట్స్ ని ఆ అంకుల్ ఎంతో సులభంగా చేసేసాడు. ఈ క్రమంలోనే ఆ అంకుల్ చేసిన పనికి ప్రస్తుతం నెటిజన్లు అందరూ కూడా అవాక్కవుతున్నారు  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక వ్యక్తి వీడియోలో హీరో స్ప్లెండర్ బైక్ పై విన్యాసాలు చేస్తున్నాడు. అతను బైకు వెనుక సీటు మీద కూర్చొని నడుపుతున్నాడు. అయితే అతను ఎలాంటి మూమెంట్ ఇవ్వకుండానే బైక్ దానంతట అదే స్పీడ్ ని కవర్ చేసుకుంటూ వెళ్తుంది. ఇక ఇది చూసిన నేటిజన్లు తమ కళ్ళను తాము నమ్మలేకపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఇది ఎలా సాధ్యమైంది అంటూ కామెంట్లు పెడుతూ ఉండడం గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి: