ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెల‌కొన్న ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల‌పై జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌తో చ‌ర్చించారు. తెలుగుదేశం పార్టీ కార్యాల‌యాల‌పై రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌రిగిన దాడుల అంశంతోపాటు త‌న‌పై తెలుగుదేశం పార్టీ నేత‌లు చేసిన వ్యాఖ్య‌ల‌ను కూడా జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్ ద‌గ్గ‌ర ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది. న‌వంబ‌రు ఒక‌టోతేదీన వైఎస్సార్ జీవిత‌కాల సాఫ‌ల్య పుర‌స్కారాల ప్ర‌దానోత్స‌వానికి రావాల్సిందిగా జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌ను ఆహ్వానించారు. దాదాపు 40 నిముషాల‌సేపు చ‌ర్చించిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ శాస‌న‌స‌భ స‌మావేశాల‌పై కూడా మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ప‌ట్టాభి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. దీనికి నిర‌స‌న‌గా అదేరోజు వైకాపా కార్య‌క‌ర్త‌లు మంగ‌ళ‌గిరిలోని తెదేపా కేంద్ర కార్యాల‌యంతోపాటు రాష్ట్ర‌వ్యాప్తంగా ఉన్న కార్యాల‌యాల‌పై కూడా దాడులు జ‌రిపిన సంగ‌తి తెలిసిందే. అనంత‌రం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు మంగళ‌గిరిలో ధ్వంస‌మైన కార్యాల‌యంలోనే 36 గంట‌ల‌పాటు నిర‌స‌న దీక్ష చేప‌ట్ట‌డంతోపాటు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర‌ప‌తికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: