మన దేశాన్ని డ్రగ్స్ భూతం కమ్మేస్తోంది. ఏ రాష్ట్రంలో చూసినా డ్రగ్స్ మాఫియాలు విజృంభిస్తున్నాయి. ఆరోగ్యవంతమైన సమాజం, సుసంపన్నమైన దేశం లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇలాంటి డ్రగ్స్‌ ఉనికి ఉండకూడదు. అంతే కాదు.. ఈ డ్రగ్స్‌ అక్రమ వ్యాపారం వల్ల వచ్చే డబ్బు  దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగపడుతోంది కూడా. డ్రగ్స్‌పై పోరాటం వేగంగా సరైన దిశలో పురోగమించకపోతే.. దేశం ఘోరంగా నష్టపోవడం ఖాయం.

ఎందుకంటే.. మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌, వాటి రవాణా ఏ సమాజంపైనైనా దుష్ప్రభావం చూపుతాయి. ఎప్పుడైతే డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ జరిగి, అవి సమాజంలోకి వెళ్తాయో.. అప్పుడు దాని బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మాదక ద్రవ్యాలను అరికట్టాలంటే జీరో టాలరెన్స్ విధానంతో ముందుకు వెళ్లాల్సిందే. డ్రగ్స్‌ కారణంగా డర్టీ మనీ చలామణిలోకి వస్తోంది. అందుకే డ్రగ్స్‌ స్మగ్లింగ్‌, రవాణాను సరిగ్గా అడ్డుకుంటే రాబోయే తరాలను కాపాడుకున్నట్టే..

మరింత సమాచారం తెలుసుకోండి: