శిరోజసంరక్షణ కోసం మనం అనేక ఖరీదైన ప్రోడక్ట్స్ పై ఖర్చు చేయడం జరుగుతుంది. కానీ, వాటిలో కొన్ని ఫలితాలు ఇవ్వకపోగా మరికొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ను చూపించడంతో సమస్య మరింత తీవ్రంగా మారడాన్ని మనం గమనించవచ్చు. పైగా, హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ లో కెమికల్స్ ను కూడా జోడిస్తారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.


కిచెన్ రెమెడీస్ తో హెయిర్ ప్రాబ్లెమ్స్ నుంచి సులభంగా రిలీఫ్ పొందవచ్చు. ముఖ్యంగా, వంటింట్లో సులభంగా లభ్యమయ్యే నువ్వుల నూనెను శిరోజాల సంరక్షణకు వాడటం ద్వారా అనేక కామన్ హెయిర్ కేర్ ప్రాబ్లెమ్స్ కు ఈజీగా చెక్ పెట్టవచ్చు. 


మరి నువ్వులనూనెను హెయిర్ కేర్ కి ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందామా...? నువ్వుల నూనెతో వారానికి ఒకసారి స్కాల్ప్ ను మసాజ్ చేయటం ద్వారా స్కాల్ప్ లోని నేచురల్ బాలన్స్ ను రీస్టోర్ చేయడం జరుగుతుంది. శిరోజాలు ఒత్తుగా మారతాయి. 

నువ్వులనూనెను తలకు తరచూ అప్లై చేసేవారికి తలనొప్పి, బట్టతల, జుట్టు నెరవడం అలాగే హెయిర్ ఫాల్ వంటి సమస్యలు సాధారణంగా ఇబ్బంది పెట్టావు. హెయిర్ హెల్త్ తో పాటు స్కాల్ప్ హెల్త్ ను మెరుగుపరచడంలో నువ్వుల నూనె ప్రధాన పాత్ర పోషిస్తుంది. హెయిర్ ను నల్లగా నిగనిగలాడేలా చేస్తుంది. అలాగే, నిద్రలేమి సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. 


సూర్యుడి హానికర యూవీ రేస్ నుంచి రక్షణ లభిస్తుంది. నువ్వుల నూనె సహజసిద్ధమైన సన్ బ్లాకింగ్ ఏజెంట్ లా పనిచేస్తుంది. అందుకే, నువ్వుల నూనెను స్కాల్ప్ పై మసాజ్ చేసుకుంటే ఎండవలన తలెత్తే హెయిర్ డేమేజ్ సమస్య తగ్గుతుంది. ఈ ఆయిల్ అనేది తలపై ప్రొటెక్టివ్ కోట్ ను ఏర్పరుస్తుంది. అలాగే, పొల్యూషన్ నుంచి కూడా హెయిర్ కు రక్షణనిస్తుంది. 


నువ్వుల నూనెను లీవ్ ఇన్ కండిషనర్ గా కూడా వాడవచ్చు. ఇది హెయిర్ షైన్ ను పెంచుతుంది. రెండు లేదా మూడు డ్రాప్స్ ఆయిల్ ను అరచేతులపై అప్లై చేసుకుని రబ్ చేసి హెయిర్ పై అప్లై చేస్తే హెయిర్ షైనీగా మారుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: