హెలికాప్టర్ మనీ పాలసీ గురించి రెండు రోజులుగా తెగ చర్చ జరుగుతోంది. కరోనా కారణంగా ప‌త‌న‌మ‌వుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ఇది మంచి పద్ధ‌తిగా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సమయంలో బీహార్‌లో కరెన్సీ వర్షం కురిసింది. పెద్ద ఎత్తున డబ్బులు గాల్లో నుంచి ఇళ్ల ముందు పడటం చూసి స్థానికులంతా ఆందోళనకు గురయ్యారు. డబ్బుతో పాటు ఓ చీటిలో మిమ్మల్ని నాశనం చేస్తానంటూ హెచ్చరిస్తూ ఉండటమే దీనికి కారణం. ఇది చూసిన వారంతా ఇళ్ల నుంచి బయట అడుగుపెట్టడానికి వణికిపోతున్నారు.  పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు ప్రారంభించారు.
 

సహర్స పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల ముందు రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లను గుర్తు తెలియని వ్యక్తులు చల్లారు. వాటితో పాటు చీటిలో ‘నేను క రోనాతో వచ్చాను. నన్ను స్వీకరించండి. లేకపోతే మీ అందరినీ వేధిస్తాను’ అంటూ రాసిపెట్టారు. వాటిని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు వచ్చి పరిశీలించి ఆకతాయిల పనిగా భావించారు. 


కానీ చాలా ప్రాంతాల్లోనూ ఇలాగే దర్శనం ఇవ్వడంతో దీన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే కేసు నమోదు చేసుకొని నోట్లను పడేసిన వారి కోసం గాలిస్తున్నారు. ఎవరైనా ప్లాన్ ప్రకారమే ఇలా చేస్తున్నారా..?  లేకపోతే ఆకతాయి వేషాలా అని తేల్చడంలో మునిగిపోయారు. ఈ నోట్ల వర్షం గురించి తెలిసి రాష్ట్రంలో అంతా దీనిపైనే చర్చించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: