ఎక్కడో చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా భూతం ఇప్పుడు ప్రపంచానికి నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇప్ప టి వరకు కనీ వీనీ ఎరుగని రీతిలో మరణాలు సంబవిస్తున్నాయి. కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.  ముఖ్యంగా కరోనా వైరస్ లక్షణలు లేని వారికి కూడా కరోనా సోకుతుంది.  ఆ తర్వాత పాజిటీవ్ కేసు నమోదు అయినా.. అప్పటికే వ్యక్తి వల్ల మరికొంత మందికి సోకుతుంది.  ఇలా తెలియకుండానే ఒకరి నుంచి మరొరికి వ్యాధి సోకుతుంది.  ఫిబ్రవరి మాసంలో మన భారత్ లో కరోనా కేసులు మొదలయ్యాయి.. ఇప్పుడు బీభత్సం సృష్టిస్తుంది.  ఈ రోజు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 9,851  మందికి కొత్తగా కరోనా సోకింది.

 

 

దేశంలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవే. అదే సమయంలో 273 మంది మరణించారు.  ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 2,26,770 కి చేరగా, మృతుల సంఖ్య 6348 కి చేరుకుంది. 1,10,960 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,09,462 మంది కోలుకున్నారు.  భారత్ లో గత కొన్ని రోజలు నుంచి లాక్ డౌన్ సడలించడం వల్ల ఈ పరిణామాలు జరుగుతున్నాయని.. సోషల్ డిస్టెన్స్, మాస్క్ లు ధరించకపోవడం వల్ల కేసులు మరింత పెరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: