ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలనపై బిజెపి అగ్ర నేత రాం మాధవ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తిరుముల భూముల విషయంలో ప్రజల ఆగ్రహానికి గురయ్యారు అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆంద్ర లో పాలన అంతా రివర్స్ లో సాగుతుంది అన్నారు. పోలవరంలో రివర్స్ అన్నింటిలో రివర్స్ అంటూ ఆయన విమర్శలు చేసారు. తిరుమల భూముల విషయ౦లో కూడా రివర్స్ లో వెళ్ళారు అన్నారు. 

 

అమరావతి రివర్స్ తో పాలన ఆంధ్రలో మొదలయింది అన్నారు. జగన్ ఏడాది పాలనకు శుభాకాంక్షలు చెప్తే చేసిన పాపాలు మర్చిపోయామని కాదు. ఎపీకి 45 వేల కోట్లు రాష్ట్ర వాటా కింద చెల్లించామని అన్నారు. మద్యపాన నిషేధం అని ఏపీలో కొత్త బ్రాండ్ లు తీసుకొచ్చారని ఆయన విమర్శించారు. వారానికి ఒకసారి కోర్ట్ తప్పుబడుతున్న ప్రభుత్వం  ఇదే అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు. ఒకరు బెయిల్ మీద ఉన్నారు మరొకరు బెయిల్ కోసం ఉన్నారని అయన వ్యాఖ్యలు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: