అమెరికాలో కరోనా వైరస్ రోజు రోజుకి పెరుగుతుంది గాని తగ్గడం లేదు. ఈ మధ్య కాస్త అమెరికాలో కరోనా అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్ళీ భారీగా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. అమెరికాలో మళ్లీ లాక్‌డౌన్ ప్రకటిస్తారా? అనే ప్రశ్నకు ట్రంప్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

 

అమెరికా ఎట్టిపరిస్థితుల్లో మళ్లీ లాక్‌డౌన్‌ను అమలు చేసే ప్రసక్తే లేదని ఆయన మీడియాతో ముందు స్పష్టం చేసారు. ఇదే విషయాన్ని శ్వేత‌సౌధం ప్రతినిధులు చెప్పారని ఆయన అన్నారు. ఇక అమెరికాలో 22 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అక్కడ ఇప్పుడే జనాలు కాస్త బయటకు వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కరోనా విషయంలో లాక్ డౌన్ విధిస్తే అమెరికా ఆర్ధిక వ్యవస్థ కూలిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: