కరోనా వైరస్  అమెరికాను వణికిస్తోంది. అస‌లు ఇప్పుడు అక్క‌డ న‌మోదు అవుతోన్న కేసులు చూస్తుంటే క‌రోనా వైర‌స్ అమెరికాను అంతం చేసే దిశ‌గా విజృంభిస్తోన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం అక్క‌డ రోజుకు 40 వేల కొత్త కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే అక్క‌డ సామాజిక వ్యాప్తి కూడా ఎక్కువుగా ఉండ‌డంతో ప్రస్తుతం రోజుకు 40వేలకు పైగా నమోదవుతున్న కేసులు, ఇకపై లక్షకు చేరినా ఆశ్యర్యం లేదని కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కాంగ్రెస్‌ను హెచ్చరిస్తున్నారు.

 

క‌రోనా ఇంత‌లా విజృంభిస్తున్నా అక్క‌డ ప్ర‌జ‌ల్లో రోజు రోజుకు ఏం జ‌రుగుతుందిలే అన్న నిర్ల‌క్ష్యం ఎక్కువుగా క‌నిపిస్తోంద‌ని.. ప్ర‌తి ఒక్క‌రు కూడా వ్య‌క్తిగ‌త జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో పాటు స్వీయ‌నిర్బందం పాటించాల‌ని సూచించారు. అలాగే మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం నిబంధలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏదేమైనా ప్ర‌స్తుతం అక్క‌డ ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో రోజుకు ల‌క్ష కొత్త కేసులు వ‌స్తే అమెరికా చాలా వ‌ర‌కు స‌ర్వ‌నాశ‌నం అవ్వ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: