తెలంగాణాలో ఈ మధ్య కాలంలో అడవి జంతువులు కంగారు పెడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ సరిహద్దు జిల్లాల్లో ఎక్కడో ఓకే చోట చిరుత పులులు బయటకు వస్తున్నాయి. దీనితో అధికారులు కూడా అప్రమత్తం అవుతున్నారు. తాజాగా నల్గొండ జిల్లాలో కూడా చిరుత పులి కనపడింది. నల్గొండ మండలం దోమలపల్లి, అప్పజీపేట, బుడ్డారం గ్రామాల్లో చిరుత హాల్చల్ చేసింది.

అర్ధరాత్రి అరుపులతో గ్రామస్తులను భయబ్రాంతులకు గురి చేసింది. ఇక భయంతో రాత్రంతా జాగారం చేసిన గ్రామస్థులు... పులి కోసం గాలింపు చేపట్టారు. చిరుత జాడ కోసం వేట ప్రారంభించిన అటవీశాఖ అధికారులు... అక్కడక్కడా సీసీ కెమెరాలు, బోన్ ల ఏర్పాటు చేసారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. స్థానికులు ఎవరూ కూడా ఇప్పుడు ఇల్లు దాటి బయటకు వెళ్ళాలి అంటే ఒకటికి వంద సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: