ఏపీ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌పై టీడీపీ ఏపీ మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆమె కేవ‌లం ఒక బొమ్మ మాత్ర‌మే అని... ఆమెను ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌తో పాటు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీ ఇస్తూ ఆడిస్తున్నార‌ని ఆమె మండిప‌డ్డారు. 20 నెల‌లుగా రాజారెడ్డి రాజ్యాంగంలో ఏపీలో ఎందరో ఆడ‌పిల్ల‌ల‌పై ఎన్నో అమానుషాలు జ‌రిగినా... ఒక్క ఆడ‌పిల్లను కూడా కాపాడుకోలేని స్థితిలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉంద‌ని ఆమె మండిప‌డ్డారు.

గుంటూరు జిల్లా న‌ర‌సారావుపేట‌లో అనూష‌ను దారుణంగా హ‌త్య చేసిన విష్ణువ‌ర్థన్ రెడ్డిని క‌ఠినంగా శిక్షించాల‌ని ఆమె డిమాండ్ చేశారు. ప‌క్క‌న రెడ్డి ఉంటే ఎంత అరాచ‌కం అయినా చేయొచ్చా ? అని ఆమె ప్ర‌శ్నించారు. సాక్షి పేపర్ లో విష్ణువర్ధన్ రెడ్డి పేరులో రెడ్డిని తీసేసి వార్త రాశారని చెప్పారు. దిశా చట్టం ఒక దిక్కుమాలిన చట్టమని... ఒక చట్టాన్ని సక్రమంగా తయారు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని విమర్శించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: