క‌రోనా మ‌హ‌మ్మారి రోజురోజుకు దేశంలో వీర‌విహారం చేస్తూనే ఉన్న‌ది.  పేద‌, ధ‌నిక‌, అని తేడా లేకుండా.. వీఐపీలను ముఖ్యంగా ఎవ్వ‌రినీ కూడా వ‌ద‌ల‌డం లేదు. ప‌లువురు సినిప్ర‌ముఖులు, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌ను సైతం వెంటాడుతోంది. దేశంలో ఇప్ప‌టికే 3,06,064 కేసులు న‌మోదు అయ్యాయి. నిన్న‌టికంటే ఇవాళ 27,469 కేసులు త‌క్కువ న‌మోదు అవ్వ‌డం కాస్త ఊర‌ట‌నిచ్చే విష‌య‌మే. అయితే గ‌డిచిన 24 గంటల్లో భార‌త్‌లో 439 మంది మృతి చెందార‌ని కేంద్ర ఆరోగ్య‌శాఖ నివేదిక‌లో వెల్ల‌డించింది.

24 గంట‌ల్లో 2,43,495 మంది కోలుకున్నారు. దేశంలో ప్ర‌స్తుతం 22,49,335 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో పాజిటివిటీ రేటు 20.న‌75 శాతంగా ఉన్న‌ది. తాజాగా ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌కు క‌రోనా పాజిటివ్ అని తేలింది. త‌న‌కు క‌రోనా సోకింద‌ని శ‌ర‌ద్ ప‌వార్ వెల్ల‌డించారు. ఆందోళ‌న చెంద‌న‌వ‌స‌రం లేద‌ని వెల్ల‌డించారు. త‌న‌తో కాంటాక్ట్ అయిన వారు టెస్ట్‌లు చేయించుకోవాల‌ని సూచించారు. డాక్ట‌ర్ల సూచ‌న మేర‌కు చికిత్స పొందుతున్న‌ట్టు చెప్పారు. దేశంలో క‌రోనా తీవ్రంగా ఉంద‌ని.. ప్ర‌జ‌లు త‌ప్ప‌నిస‌రిగా కొవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను తీసుకోవాల‌ని సూచించారు శ‌రద్ ప‌వార్‌.


మరింత సమాచారం తెలుసుకోండి: