ఏపీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. నాయకులు ఇప్పటి నుంచే స్థానాలపై కన్నేస్తున్నారు. తాజాగా రాజమహేంద్రవరంలో జరిగిన టీడీపీ సర్వసభ్య సమావేశంలో ఇలాంటి సీనే కనిపించింది. ఈ సమావేశానికి భారీగా తెలుగుదేశం శ్రేణులు హాజరయ్యారు. టీడీపీ కార్యనిర్వహక రాష్ట్ర కార్యదర్శి ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.


అయితే.. ఈ బేటీలో ఆదిరెడ్డి వాసు చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించాయి. ఈసారి ఖచ్చితంగా రాజమహేంద్ర నగర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తానని ఆయన తేల్చి చెప్పారు. గతంలో కొన్ని సమీకరణాలవల్ల నా భార్య భవానికి ఎమ్మెల్యే సీటు ఇచ్చారని.. అప్పుడు నేను తగ్గాను... ఈసారి మాత్రం తగ్గేది లేదు ఆదిరెడ్డి వాసు కుండబద్దలు కొట్టేశారు. తనకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదని.. అంత ఓపిక కూడా లేదని ఆదిరెడ్డి వాసు చెప్పేశారు. రాజమహేంద్రవరం నగరం లో మంచి పట్టు సాధించాం ఇక్కడి నుంచే పోటీ చేస్తామని చెప్పేసారు. అయితే.. అధిష్ఠానం ఆదేసిస్తే ఏదైనా తప్పదు....కానీ మా ఆలోచన అర్బన్ పైనే ఉందని.. 2024లో సీఎం చంద్రబాబే అంటూ ఆదిరెడ్డి వాసు చెప్పుకొచ్చారు. మొత్తానికి చంద్రబాబుకే సిగ్నల్ పంపారన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: