ప్రజలకు మరో షాక్ ఇచ్చిన మోదీ.. ఏంటి ఆ షాక్ అని అనుకుంటున్నారా? అదేనండి.. ఈ నెల 20 వ తేదీ నుండి అత్య‌వ‌స‌ర సర్వీసులకు అనుమతి ఇస్తున్నట్టు కేంద్రం కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. అయితే అందులోని ఓ నిబంధనను మాత్రం తీసివేయనుంది. 

 

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అందరూ అనుకున్నట్టు కరోనా వైరస్ వ్యాప్తి తగ్గటం లేదు.. ఇంకా రోజు రోజుకు వ్యాపిస్తుంది. ఇంకా ఇప్పటికే ఈనెల 14న పూర్తవ్వాల్సిన లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరుకు పొడిగించారు. అయితే ఈ నెల 20వ తేదీ నుండి నిత్యావసర సర్వీసులకు అనుమతి  ఇస్తున్నట్టు ప్రకటించారు. 

 

అయితే అందులోని నిబంధ‌న 13 ప్ర‌కారం అత్య‌వ‌స‌రం కానీ స‌ర్వీస్‌ల‌ను ఈ కామ‌ర్స్‌ సంస్థలు అందించ‌వ‌చ్చ‌ని కేంద్రం పేర్కొంది. కానీ ఈ నిబంధనపై ప్రధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్ స‌హా ప‌లు రాజ‌కీయ పార్టీలు విమ‌ర్శ‌లు వచ్చాయి. దీంతో కేంద్రం చేసిన గైడ్‌లైన్స్‌ను వెన‌క్కి తీసుకుంది. దీంతో ఆన్లైన్ లో ఇప్పటి వరుకు ఆర్డర్లు చేసినవి అన్ని కూడా క్యాన్సిల్ చేస్తున్నారు. వినియోగదారులకు రిఫండ్ చేస్తున్నారు. 

 

దీంతో ప్రజలంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. లాక్ డౌన్ ప్రకారం మేము బయట తిరగటం లేదు.. మాకు అనుమానంగా ఉన్నప్పటికీ మేము ఈ కామర్స్ వంటి వాటి నుండి ఆన్లైన్ ఆర్డర్ ఇవ్వాలి అనుకున్నాం.. కానీ అది కూడా కుదరడం లేదు.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 

అయితే ఇంకా ఈ కామర్స్ సంస్దలు అయినా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటివి వచ్చే జూన్ వరుకు ఆగిపోనున్నాయి. ఇంకా ఆన్లైన్ ప్రియులకు కాస్త ఇబ్బంది అయినా.. ఇది కూడా మంచి విషయం అనే చెప్పాలి.                                

మరింత సమాచారం తెలుసుకోండి: