
ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే ఉన్మాదులుగా మారిపోతున్న మనుషులు ఇక సొంత వారి విషయంలో కాస్తయినా జాలీ దయ చూపించకుండా దారుణంగా హత్యలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. ఇక ఇలాంటి ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా షాక్ అయ్యేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. సాటి మనుషులతో మంచిగా మెలగాలి అంటేనే భయపడే పరిస్థితులను తీసుకువస్తూ వస్తున్నాయ్. ఇక్కడ ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సదరు వ్యక్తి మద్యానికి బానిసగా మారిపోయి కుటుంబ బాధ్యతలను మరిచిపోయాడు. అయితే మద్యం తాగొద్దు అని చెప్పినందుకు ఏకంగా భార్యను అత్తను దారుణంగా చంపేశాడు.
ఈ ఘటన ఎక్కడో కాదు కర్నూలు జిల్లా లో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. పెదకడుబూరు మండలం జాలవాడలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. వ్యక్తి తన భార్యను అత్తను కూడా వేటకుడవలతో అత్యంత దారుణంగా నరికి చంపాడు. మద్యం తాగుతూ కుటుంబ బాధ్యతలు మరిచిపోయిన అల్లుడు నాగరాజుకు అత్త భీమక్క హెచ్చరిస్తూ వస్తుంది. అయితే ఇదే విషయంపై ఇటీవల ఇంట్లో గొడవ జరిగింది. దీంతో ఇక మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన నాగరాజు భార్య శాంతిని అత్త భీమక్కను దారుణంగా నరికేశాడు. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.