ఈ మధ్య నేరాల రేటు ఆడవారికే ఎక్కువగా ఉందని పోలీసులు వెల్లడించారు.. ఈజిpగా డబ్బులు సంపాదించాలన్న కోరిక ఉన్న ఆడవాళ్లు తప్పుడు కార్యక్రమాలు చేయడం తో పాటుగా, తప్పుడు మార్గాలను కూడా ఎంచుకుంటున్నారు. ఇది పోలీసులకు పెద్ద తల నొప్పిగా మారింది. తాజాగా మరో మహిళ పెళ్ళి పేరుతో ముగ్గురు వ్యక్తులను శాంతం దొచెసింది.. ఒకరికి తెలియకుండా మరొకరిని వివాహమాడి డబ్బులు గుంజి పరారైంది..


వివరాల్లొకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నిత్య పెళ్లికూతురు వ్యవహారం వెలుగు చూసింది. తాను అనాథనని నమ్మించి ఓ యువతి ఓ యువకుడిని పెళ్లి చేసుకుంది. అతడు ఆమె ఖాతాలో మూడో వ్యక్తి.. అతన్ని నైస్ గా నమ్మించి లక్షలు డబ్బులను దండుకుంది.ఆ తర్వాత మోసపోయానని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన తిక్వ్రుపతిలో ఆలస్యంగా వెలుగు చూసింది. చిత్తూరు జిల్లాలోని విజయపురం మండలానికి చెందిన యువకుడు మార్కె టింగ్ లో మంచి ఉద్యోగం చేస్తున్నాడు.

ఇక స్థానికంగా ఉన్న ఓ ఫైనాన్స్ కంపెనీలో పని చేస్తున్నా సుహాసిని తో పరిచయం ఏర్పడింది.. అది కాస్త ప్రేమగా మారింది.తాను అనాథనని సుహాసిని యువకుడికి చెప్పింది. దాంతో అతను తన కుటుంబ సభ్యులను ఒప్పించి నిరుడు డిసెంబర్ లో వివాహం చేసుకున్నాడు.ఆ సమయంలో ఆమెకు 8 తులాల బంగారం పెట్టారు తనను చిన్ననాటి నుంచి ఆదరించినవారికి ఆరోగ్యం బాగాలేదని, ఇలా ఏవేవో సాకులు చెప్పి, మరో ఐదు లక్షలు దొచుకుంది. అతని తండ్రి నుంచి మరో రూ.2 లక్షలు తీసుకుంది.అది తెలియడంతో యువకుడు సుహాసినిని నిలదీశాడు. దాంతో ఈ నెల 7వ తేదీన ఇరువురికి మధ్య గొడవ జరిగింది. మర్నాడు సుహాసిని కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది.. దాంతో అతను పోలీసులను ఆశ్రయించాడు.. ఇలాంటి వాటిని నమ్మి మోస పొవద్దని హెచ్చరిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: