
న్యాయవాదులైన సోమశేఖర్ సుందరేశన్ ను ముంబై హైకోర్టుకు, ఆర్.జాన్.సత్యం ను మద్రాస్ హైకోర్టుకు న్యాయమూర్తులుగా తిరిగి సిఫారసు చేసింది. అంతేకాకుండా మద్రాస్, కర్ణాటక, అలహాబాద్ హైకోర్టులకు న్యాయమూర్తులుగా మరొక 20మందిని సిఫారసు చేసింది. వీళ్ళతోపాటు అమితేష్ బెనర్జీ, సత్యసేన్ లను కలకత్తా న్యాయమూర్తులుగా వెంటనే నియమించాలని పేర్కొంది. అమితేష్, సేన్ ల పేర్లను ఇప్పటికే కేంద్రం రెండేసి సార్లు తిప్పి పంపింది. అమితేష్ తండ్రి యూ.సి.బెనర్జీ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. గోద్రా లో సబర్మతి రైలు ప్రమాదం వెనుక కుట్ర కోణం ఏదీ లేదని తేల్చి చెప్పిన కమిషన్ కు సారథి. దాంతో కొలీజియం కేంద్రాన్ని ఉద్దేశించి పైన చెప్పిన విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
ఆర్. జాన్ సత్యం.. మోడీపై విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని, సోమశేఖర్ ప్రభుత్వ విధానాల పై సోషల్ మీడియాలో విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారని, వాళ్ల పేర్లను కేంద్రం తిప్పి పంపింది. అయితే ఈ అభ్యంతరాలను తాజాగా కొలీజియం తోసిపుచ్చింది. స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను చెప్పడం రాజ్యాంగపరమైన పదవులు చేపట్టడానికి అడ్డంకి కాదని స్పష్టం చేసింది. ముందుగానే రాజకీయ అజెండాతో ఉన్న వ్యక్తులు న్యాయవాదులుగా పని చేస్తారా, వారు న్యాయం చేస్తారా అనేది కేంద్రం అడుగుతున్న ప్రశ్న.