
దీనికి సంబంధించి ఢిల్లీలో మీటింగ్ పెట్టుకుంటే తెలిసిపోతుందని హైదరాబాద్ కు మకాం మార్చారు. హైదరాబాద్ లో వ్యాపారా లావాదేవీలు నడుపుకున్నారు. దీనికి మనీష్ సిసోడియా నాయకత్వం వహించారు. ఈ లిక్కర్ స్కాంలో ఉన్నటువంటి నాయకులు ఏ హోటళ్లో సమావేశ మయ్యారు. ఎక్కడ కూర్చున్నారు. ఏ హవాలా మార్గంలో వీరికి డబ్బులు అందాయి అనే అన్ని లెక్కలు ఈడీ దగ్గర ఉన్నాయి. దీనికి సంబంధించి మొదటి ఛార్జీషీట్ లో మనీష్ సిసోడియా పేరు లేదు, రెండో ఛార్జీషీట్ లో కూడా ఆయన పేరు లేదని సంతోషించే లోపు ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బె తగిలింది.
ఏకంగా అరవింద్ కేజ్రీవాల్ పేరును రెండో ఛార్జీషీట్ లో ఈడీ నమోదు చేయడం సంచలనంగా మారింది. సిసోడియాకు కేజ్రీవాల్ చెబితేనే చేస్తాడు కదా కేజ్రీవాల్ అనుమతి లేనిది చేయడనేది ఇప్పుడు తెలుస్తున్న విషయం. ఇదే లిక్కర్ స్కాం కేసులో ఛార్జీ షీట్ లో ఏపీ నుంచి వైసీపీ ఎంపీ మాగుంట, తెలంగాణ నుంచి ఎమ్మెల్సీ కవిత పేరు ఉండటంతో ఈ కేసుకు ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది.