అమరావతి ఆందోళనలు మొన్న మిన్నంటాయి.. అందుకు కారణం.. అమరావతి నగరానికి శంకుస్థాపన చేసి సరిగ్గా ఐదేళ్లయింది. ఇప్పుడు ఆ అమరావతి అభివృద్ధి ఆగిపోయింది. కీలకమైన రాజధాని విశాఖకు తరలిపోతోంది. కేవలం నామ్‌ కే వాస్తే అసెంబ్లీ మాత్రం అమరావతిలో మిగిలిపోతోంది. ఇలాంటి సమయంలో టీడీపీ అమరావతి ఉద్యమానికి మొదట్లో బాగానే సపోర్టు చేసింది. ఇప్పటికీ టీడీపీ అమరావతికే కట్టుబడి ఉంది.

అయితే ఎంత జాకీలు వేసి లేపినా అమరావతి ఉద్యమం పైకి లేవడం లేదు. ఎంత రెచ్చగొట్టినా మిగిలిన ప్రాంతాల ప్రజలు అమరావతి ఉద్యమాన్ని ఓన్ చేసుకోవడం లేదు. అంతెందుకు చివరకు రాష్ట్రంలోని మిగిలిన టీడీపీ నేతలు కూడా అమరావతి ఉద్యమాన్ని పట్టించుకోవడం మానేశారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు కూడా ఈ అమరావతి ఉద్యమాన్ని లైట్ గా తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. అమరావతి ఉద్యమం 300 రోజులకు చేరుకున్న రోజు కానీ.. చివరకు అమరావతి నగర శంకుస్థాపనకు 5 ఏళ్లు పూర్తయిన రోజు కానీ.. చంద్రబాబు అమరావతి ఆందోళనల్లో పాల్గొనలేదు.

ఎట్‌ లీస్ట్.. జూమ్‌లో నైనా ప్రెస్ మీట్ పెట్టలేదు. ఏదో నామ్‌ కే వాస్తే గా.. ఓ పోస్టు పెట్టేసి చేతులు దులిపేసుకున్నారు. అంటే అమరావతి ఉద్యమం కూడా చంద్రబాబును అంతగా కదిలించలేకపోయిందన్నమాట.  అలాంటి చంద్రబాబు నిన్న గీతం యూనివర్శిటీలోని అక్రమ కట్టడాల కూల్చివేత వార్త తెలియగానే మాత్రం స్క్రీన్ మీదకు వచ్చేశారు. ఇది అన్యాయం.. అక్రమం అంటూ జూమ్ లో లైవ్‌లోకి వచ్చేసి జగన్ సర్కారుపై తిట్ల దండకం అందుకున్నారు.

దీంతో చంద్రబాబు తీరు చూసి సొంత పార్టీ నాయకులే ఆశ్చర్యపోయే పరిస్థితి. అమరావతికి ఐదేళ్ల రోజు కూడా స్పందించని బాబు గీతం విషయానికి వచ్చేసరికి అంత అర్జంటుగా స్పందించడం చూసి ఆశ్చర్యపోయారు. అయితే గీతం యాజమాన్యం స్వయంగా చంద్రబాబుకు దగ్గర బంధువని తెలిసినవాళ్లు మాత్రం పెద్దగా ఆశ్చర్యపోలేదనుకోండి. బాలయ్య చిన్నల్లుడి విద్యాసంస్థ కావడంతో చంద్రబాబు చటుక్కున స్పందించారు. అక్రమ భూముల వ్యవహారం సంగతి ఎత్తకుండా.. ఓ విద్యాసంస్థపై దాడి చేస్తారా.. అన్యాయం.. అరాచకం అంటూ రంకెలేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: