కరోనా మహమ్మారి రాగానే ప్రపంచం తీవ్ర భయాందోళనలకు గురైన విషయం తెలిసిందే. దీనితో ఆయా దేశాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన విషయం  చూశాం. ఒక్కసారి ఈ సమస్యలో నుండి బయటపడాలి అనే విషయం గుర్తించిన కొందరు పరిష్కారం కోసం కృషి చేయడం ప్రారంభించారు. దానిఫలితమే కరోనా కు ఒకటి తరువాత ఒకటిగా అనేక వాక్సిన్ లు వచ్చాయి. అయితే వీటిపై మొదటిలో కాస్త అపోహలు ఉన్నప్పటికీ, కొందరు ధైర్యంగా ముందుకు రావడంతో పరిస్థితి మెరుగుపడింది. ఇక వాక్సినేషన్ ప్రారంభం అయ్యాక ఎన్ని డోసులు తీసుకోవాలి, ఒక్కో డోసు మధ్య ఎంత సమయం వేచి ఉండాలి అనేది కాలం గడిచే కొద్దీ మారుతూ వచ్చాయి.

అనేక దేశాలలో వాక్సినేషన్ చురుగ్గా సాగుతుంది. అతిపెద్ద ప్రజాస్వామ్యంగా పేరుగాంచిన భారత్ లో కూడా కరోనా వాక్సినేషన్ జరుగుతూనే ఉంది. అయితే ప్రారంభంలో ఉత్పత్తి అవసరాల మేరకు లేకపోవడంతో మరియు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ఒక్కో వాక్సినేషన్ డోసుకు మధ్య 40 రోజుల వరకు సమయం ఉంటె సరిపోతుందని తెలిపింది. అనంతరం ఈ సమయం వివిధ పరిస్థితుల నేపథ్యంలో 60 రోజులని, ఆతరువాత 84 రోజులకు పెంచుకుంటూ వచ్చారు. తద్వారా ఉత్పత్తి కి సమయం కలిసి వస్తుంది అనేది ప్రభుత్వం నిర్ణయం.

ఇక ప్రస్తుతం ఉత్పత్తి తగిన విధంగా ఉండటంతో అలాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనల మేరకు ఈ గడువు 40 రోజులకు తగ్గించడం జరిగింది. అలాగే ఒకసారి కరోనా భారిన పడి సురక్షితంగా ఉన్న వారికి ఒక్క డోసు మాత్రం సరిపోతుందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం భారత్ రోజూ కోటికిపైగా వాక్సినేషన్ ఇస్తుంది. ఇప్పటి వరకు ఎనభై కోట్లకు పైగా వాక్సినేషన్ పూర్తి చేశారు. అయితే తాజాగా ప్రైవేట్ ఆసుపత్రులలో వాక్సిన్ వేయించుకునే వారి కోసం డోసుల మధ్య గడువు నెల రోజులకు తగ్గించారు. ఎప్పుడు వేరే కారణాలతో ఈ గడువు ని నిర్ణయించే వారు, ఈసారి ఆసుపత్రుల ప్రాతిపదికన నిర్ణయించడం విమర్శలకు దారి తీస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: